సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల హక్కులు నిర్మాత నాగవంశీ నలభై అయిదు కోట్లకు కొన్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్వంత ఆదర్శ కుటుంబం ఏకె 47కు కేవలం వారం రోజుల గ్యాప్ లో వస్తున్న మూవీ మీద ఇంత పెట్టుబడి పెట్టడం చూస్తుంటే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అలెర్ట్ విషయానికి వద్దాం.
జైలర్ 2కి సంబంధించి ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా పీక్స్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షూటింగ్ స్టార్ట్ కాకముందే ప్రోమో వీడియోతోనే నెల్సన్ అదరగొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అంతకు రెట్టింపు ఆశించడం సబబే. అయితే తాజాగా విడుదలైన థీమ్ సాంగ్ రెండు విషయాల్లో జైలర్ 2కి హెచ్చరికగా మారుతోంది. అనిరుధ్ రవిచందర్ కంపోజింగ్ లో పాట ఏమంత ఊపిచ్చేలా లేదు. నెమ్మదిగా సాగుతూ హాలీవుడ్ తరహా ట్యూన్ తో ఏదో డిఫరెంట్ గా అయితే ట్రై చేశాడు.
కానీ ఏ మేరకు పనవుతుందో అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా లిరికల్ వీడియోలో ఏఐ వాడారు. ఈజీగా తెలిసిపోయేలా విజువల్స్ ఉన్నాయి. రెండు మూడు రజనీకాంత్ ఒరిజినల్ మాంటేజ్ షాట్స్ ఉన్నప్పటికీ కిక్ ఇవ్వడానికి అవి సరిపోలేదు. జైలర్ మొదటి భాగానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు చాలా ప్లస్ అయ్యాయి. కానీ జైలర్ 2 విషయంలో పూర్ణ సాంగ్ ఓకే అనిపించుకుంది తప్ప మారుమ్రోగిపోయే ఛార్ట్ బస్టర్ కాలేదు. ఇప్పుడీ వన్ సన్ వన్ మూన్ అంత కూడా వెళ్ళదేమో.
చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2 టీమ్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో చాలా బిజీగా ఉంది. ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టేంత టైం నెల్సన్ దిలీవ్ కుమార్ దగ్గర లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సెన్సార్ కు వెళ్ళాలి. అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ ఇంకా పెండింగ్ ఉందట. చూస్తే సరిగ్గా ఇరవై రోజుల టైం ఉంది. ఇందులోనే పబ్లిసిటీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లు వగైరా చేయాలి. మరి జరుగుతున్నది విశ్లేషించుకుని తర్వాతి ప్రచారంలో జైలర్ 2 ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates