నన్ను ఏపీకి డోలో – 650 అని పిలుస్తుంటారు

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ మాంచి దూకుడు మీద వున్నారు. అధికారంలోకి రావడానికి ముందు యువగళంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా పెట్టుబడుల ఆకర్షణ కోసం తరచుగా జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ పరిపాలన విధానాన్ని యమస్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పారిశ్రామిక వేత్తలతో సన్నిహితంగా మెలుగుతూ వారికి అభిమాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.

పారిశ్రామిక వేత్తలు ఇప్పుడాయనను ఏపీకి డోలో -650అని పిలుచుకుంటున్నారు. ఈ విషయం మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 24,25 తేదీల్లో మంత్రి లోకేష్ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా జరిగిన ప్రత్యేకంగా పారిశ్రామిక సదస్సుకు హాజరయ్యారు. పబ్లిక్ అఫైర్ ఫోరమ్ ఆఫ్ ఇండియ ‘పాఫీ ‘, సీఐఐ సదస్సుల్లో పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ ఆయన ఏమి చెప్పారంటే…

ఆంధ్రప్రదేశ్ లో కొందరు పారిశ్రామిక వేత్తలు నన్ను సరదాగా ఆంధ్రప్రదేశ్ డోలో – 650 అని పిలుస్తుంటారు. సాధారణంగా మీకు తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే డోలో -650 గుర్తుకు వస్తుంది. నొప్పి తగ్గగానే మరిచిపోతుంటారు. అలాగే పెట్టుబడిదారులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నేను గుర్తుకు వస్తుంటాను. నేను వారి సమస్యలను వేగంగా పరిష్కరిస్తుంటాను.. అని లోకేష్ చెప్పారు. సమస్య పరిష్కరించడమే కాదు అలాంటి సమస్య మరెవరికీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో లోకేష్ స్పీడ్ గురించి కొందరు పెట్టుబడిదారులు చర్చించుకోవడం కనిపించింది.

ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త 300 కోట్లతో సోలార్ అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మన భారతదేశంలో ఏ రాష్ట్రం అయితే బాగుటుందో సలహా చెప్పమని ఎక్స్ లో మెసేజ్ పెట్టారు. దాన్ని చూసిన వెంటనే లోకేష్ స్పందించారు. మా రాష్ట్రానికి రండి, అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొని వచ్చే విషయంలో మంత్రి లోకేష్ ఎంత స్పీడ్ గా వుంటారో ఇదొక ఉదాహరణ మాత్రమే. అందుకే అయనంటే పారిశ్రామిక వేత్తలు ఎంతో ఇష్టపడుతున్నారు.