Political News

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి జుగుప్సాకరంగా దుర్భాషలాడిన వైనంపై అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఆ నేపథ్యంలో అరెస్టై విడుదలైన అంబటి తీరు ఏ మాత్రం మారలేదు. హోం మంత్రి అనితకు సిగ్గు, శరం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ఆమెకు సిగ్గు లేదని, ఆ పదవిని పట్టుకొని వేలాడుతూనే ఉంటుందని రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అయితే, మహిళా నేత, హోంమంత్రి అయిన అనితను అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎస్సీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి నగరం నడిబొడ్డులో అంబటి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కానీ, ఆయన మాత్రం తన తీరు మార్చుకోలేదు.
అనితను పరుష పదజాలంతో విమర్శించానని, కులం పేరుతో దూషించానని వస్తున్న ఆరోపణలను అంబటీ పూర్తిగా ఖండించారు.

తన దిష్టిబొమ్మలు తగలబెడితే తనకు నష్టమేమీ లేదని, గడ్డి తగలబడటం తప్ప తన శరీరానికి ఏమీ కాదని అంబటి వెటకారంగా మాట్లాడారు. అయితే, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ గారు బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు ఆరోపిస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం ధర్మం కాదని హితవు పలికారు. హోంశాఖ మంత్రికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనపై, జగన్ పై అనిత అత్యంత దారుణంగా మాట్లాడారని గుర్తుచేశారు.

This post was last modified on July 21, 2026 8:49 pm

Share

Recent Posts

ఆ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

5 hours ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

9 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

10 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

10 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

10 hours ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

10 hours ago