Movie News

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పుష్ప 2 రేంజ్ ఆశలు పెట్టుకుంటే పెద్ది కేవలం ఏపీ తెలంగాణ వరకే తన ప్రతాపం చూపించింది. అఖిల్ కి ఈసారైనా హిట్ దక్కేంత సీన్ ఉందాని అనుమానపడిన లెనిన్ ఊహించని స్థాయిలో విజయం సాధించింది. ఫామ్ లేని సమంత ఏకంగా వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి ఫిమేల్ మూవీస్ లో కొత్త రికార్డు సృష్టించింది.

వీటి సంగతలా ఉంచితే ఆగస్ట్ 7 కొరియన్ కనకరాజు వస్తోంది. ప్రమోషన్ల పరంగా అలసత్వం చూపించకుండా పబ్లిసిటీ పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టింది. మొన్న వదిలిన వెరైటీ మాస్ సాంగ్ ఏ మేరకు రీచ్ తెచ్చుకుంటుందో చూడాలి. హారర్ జానర్ కొత్త కాదు కానీ ఈసారి కొరియన్ దేశానికి వెళ్లడం ఏదో డిఫరెంట్ గా అనిపిస్తోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే హిట్ ఖాయమనేలా ఉంది. విడుదలకు ముందు ఇది అందరూ వ్యక్తపరిచేదే కాబట్టి మాములే.

వరుణ్ తేజ్ కి ఈ సినిమా చాలా కీలకం. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. డిజాస్టర్ల దెబ్బకు మార్కెట్ రిస్క్ లో పడింది. అనంతపూర్ ఈవెంట్ కి జనాలు తండోపతండాలుగా వచ్చారు కానీ వాళ్లంతా మొదటి రోజు థియేటర్లలో ఉంటారన్న గ్యారెంటీ లేదు. కాకపోతే ఆడియన్స్ దృష్టిలో పడేందుకు ఆ వేడుక ఎంతో కొంత దోహదపడింది. ఈ హారర్ డ్రామాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పాటలైతే భారీ వైరల్ కాలేదు.

అయితే కొరియన్ కనకరాజుకు కాంపిటీషన్ లేకపోలేదు. లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘డిసి’ అదే రోజు వస్తోంది. ఇంటెన్స్ స్టోరీ, అనిరుధ్ సంగీతం లాంటి అట్రాక్షన్లు తెలుగులోనూ డిమాండ్ తెచ్చి పెట్టేలా ఉన్నాయి. ఇంకో తెలుగు సినిమా ‘కెజెక్యూ’తో పాటు సుమంత్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ వస్తోంది. వీటిని మరీ సీరియస్ గా తీసుకోవడం తీసుకోకపోవడం పక్కనపెడితే కనకరాజు కనక సాలిడ్ గా మెప్పించగలిగితే జూన్ నుంచి మొదలైన హిట్ల ప్రవాహంలో తన పేరు కూడా వేసుకోవచ్చు. 

This post was last modified on July 21, 2026 8:59 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago