Political News

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే తదితర నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దాదాపు 4 గంటలపాటు ప్రధాని నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ నేతలను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి వేరే చోటికి వాహనాల్లో తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అంతుకుముందు, ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కలిశారు. రాహుల్ తో కొద్ది సేపు మాట్లాడిన తర్వాత జితేందర్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాహుల్ ను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో రాహుల్ గాంధీపై కీలక ఆరోపణలు చేశారు.

నీట్ పరీక్ష గురించి చర్చ జరగాలని రాహుల్ గాంధీ కోరారని, అందుకు సానుకూలంగా స్పందించామని జితేందర్ సింగ్ తెలిపారు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట మార్చారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై కూడా చర్చ జరగాలని కోరారని అన్నారు. అంతేకాదు, నీట్ పై ఏ సమయంలో చర్చించాలో కూడా కాంగ్రెస్ నేతలు చెప్పలేదని ఆయన ఆరోపించారు.

కాగా, ఢిల్లీలో జరుగుతున్న నిరసనల సెగ హైదరాబాద్ ను కూడా తాకింది. సీజేపీకి మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సోమాజిగూడలోని లోక్ భవన్ ను ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా ఈడ్చుకువెళ్లి వాహనాల్లో వేరే చోటికి తరలించారు.

This post was last modified on July 21, 2026 7:33 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago