Political News

56 ఏళ్ల యువ‌కుడికి మోడీ చురకలు

కాంగ్రెస్ ముఖ్య‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీకి ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ చుర‌క‌లు అంటించారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభానికి ముందు సోమ‌వారం ఆయ‌న పార్ల‌మెంటు వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. “దేశంలో యువ‌శ‌క్తి పుంజుకుంటోంది. అయితే.. నేను 56 ఏళ్ల యువ‌కుడి(రాహుల్‌) గురించి మాట్లాడ‌డం లేదు“ అని ప్ర‌ధాని చ‌మ‌త్క‌రించారు. అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు దేశం ఇప్పుడు వేదిక‌గా మారింద‌ని తెలిపారు.

కేవలం ఒక్క నెలలోనే దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. పౌరులందరిలోనూ గర్వభావం నింపే విజయాలను సాధించామ‌న్నారు. జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ వేదిక కావచ్చు లేదా అంతరిక్ష రంగం కావచ్చు… ఇవన్నీ భారతదేశానికి నిజంగా గర్వకారణమైన క్షణాలని పేర్కొన్నారు. గత ఏడాది పార్ల‌మెంటు వ‌ర్షాకాల‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు.. ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

రెండు  రోజుల కింద‌ట ఒక భారతీయ స్టార్టప్ స్కైరూట్ అద్భుతమైన ఘనతను సాధించిందని ప్ర‌ధాని మోడీ తెలిపారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే అంత‌రిక్ష‌ ప్రైవేట్ రంగంలో అద్భుతాలు సాధించాయన్నారు. తాజాగా భారతీయ యువత అంతరిక్షంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు.  ‘స్కైరూట్’ స్టార్టప్‌లో పనిచేస్తున్న మొత్తం బృందం సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్ర‌మేన‌ని ఇలాంటి యువతే అద్భుతాలు సాధించ‌గ‌ల‌ర‌ని పేర్కొన్నారు.

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల గురించి మాట్లాడుతూ..ఈ స‌మావేశాల‌కు నైరుతి రుతుప‌వ‌నాల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంద‌ని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు అయినా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయినా… రెండూ చురుకుగా ముందుకు క‌దిలితేనే.. ఫ‌లితం ఫలప్రదంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అవి రెండూ ఫలప్రదంగా ఉన్నప్పుడే.. అది దేశ శ్రేయస్సుకు.. సమస్త జీవరాశి క్షేమానికి దారితీస్తుందని మోదీ ఉద్ఘాటించారు. అందుకే, రుతుపవనాలు చురుకుగాను, ఫలప్రదంగానూ ఉండాలని, అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని తాము ఆకాంక్షిస్తున్నామ‌న్నారు. 

This post was last modified on July 20, 2026 9:30 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago