పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయాలు వేడెక్కాయి. సభలో గొడవలు వద్దు, తుఫాన్ సృష్టించొద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు లేవనెత్తబోయే నీట్ పేపర్ లీక్ లాంటి ఇష్యూలు హైలెట్ కానున్నాయి. అయితే సభలో ప్రధాని ఈ ప్రశ్నకు కౌంటర్ ఇస్తారా అనే దానికోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే రెగ్యులర్ చర్చల వైపు మళ్లించేందుకు మోదీ ఇలా మాట్లాడారనే టాక్ విపక్షాల నుంచి వినిపిస్తోంది.
సభలో గొడవలు కాకుండా ఆధారాలతో కూడిన చర్చలు జరగాలనేది ఈ ప్రసంగం ముఖ్య ఉద్దేశ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రసంగంలో అంతరిక్ష రంగం ప్రస్తావన కూడా ఆసక్తికరంగా మారింది. 28 ఏళ్ల యువకులున్న స్కైరూట్ ఏరోస్పేస్ ఘనతను పొగుడుతూనే, వెంటనే 56 ఏళ్ల యువకుడి గురించి నేను మాట్లాడటం లేదు అంటూ రాహుల్ గాంధీపై ప్రధాని పరోక్షంగా పంచ్ వేశారు. దేశ ప్రగతిని యువత నడిపిస్తోందని చెబుతూనే, విపక్ష నాయకుడి వయసును టార్గెట్ చేయడం మోదీ మార్క్ స్టైల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఈసారి తీసుకురాబోతున్న బిల్లుల జాబితా కూడా పెద్ద చర్చకే దారితీస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 33 నుంచి 37 కి పెంచాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల పరిష్కారానికి అని చెప్తున్నా, దీనివల్ల భవిష్యత్తులో కోర్టుల తీర్పుల సరళి మారే అవకాశం ఉందనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
దీనితో పాటు ఆదాయపు పన్ను సవరణ బిల్లు 2026, విదేశీ నిధుల నియంత్రణ వంటి బిల్లుల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దేశంలోకి వచ్చే నిధులపై మరింత నిఘా పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఉన్నత విద్యా సంస్కరణల కోసం తెస్తున్న వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025 ద్వారా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆగస్టు 13 వరకు సాగే ఈ సమావేశాలలో విపక్షాలు నిరసనలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం తెస్తున్న బిల్లుల లోతుపాతులను గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. మోదీ వేసిన పొలిటికల్ లైన్ చూస్తుంటే, సభలో ఈసారి బిల్లుల ఆమోదంతో పాటు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే నడిచేలా కనిపిస్తోంది.
This post was last modified on July 20, 2026 5:45 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…