Political News

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ లోకల్ వార్ లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేయాల్సిన కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించడానికి ‘ఏకం’ అనే వేదికను ప్రారంభించారు.

రాజకీయ పార్టీలకంటే పల్లెలు, నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిలబడే అభ్యర్థులను ఒకే గొడుగు కిందకు తేవడమే లక్ష్యంగా ఆయన ‘ఏకం’ను ప్రారంభించారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 1.60 లక్షల మందిని స్వచ్ఛందంగా బరిలోకి దించాలని ప్రణాళిక రచించారు. ఇందులో ఇండిపెండెంట్లు ఉంటారని, కొందరు కొన్ని పార్టీకి చెందిన వాళ్లు కూడా ఉంటారని చెప్పారు. స్థానిక సమస్యలపై పోరాడే ప్రతి అభ్యరికి ఈ వేదిక ద్వారా అండగా నిలవాలన్న ఆకాంక్షతోనే ఈ ‘ఏకం’ ప్రారంభించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ‘ఏకం’లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. వారి తరఫున తాను ప్రచారం చేస్తానని కేకే వెల్లడించారు. 2014-19 నుంచి ఉన్న సమస్యలు 2019-2024 వరకు ఉన్నాయని, 2024 నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదని 70 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ఇక, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సర్వే నిర్వహించామని, పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులకు సమస్యల కన్నా పదవులే ముఖ్యమని తమ సర్వేలో తేలిందని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యపై 58 శాతం, సాగునీటిపై 55 శాతం, రోడ్లపై గుంతలు అంశంపై 53 శాతం, పారిశుధ్యంపై 42 శాతం ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారని వివరించారు. కేకే చెప్పిన ఏకం కాన్సెప్ట్ వినడానికి బాగున్నా… ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు. ఇండిపెండెంట్లకు ఎంత పవర్ ఉంటుంది? వారికి ఎంత గౌరవం ఇస్తారు? అన్నది ఆల్రెడీ ఇండిపెండెంట్ గా గెలిచిన వారికి తెలుసు.

కాబట్టి అలా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వారు చాలామంది వేరే పార్టీలలో చేరారు. పోనీ ఇప్పుడు మునిసిపల్ ఛైర్మన్, మేయర్ ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగబోతోంది అసలైనా ఈ రోజుల్లో ఓటుకు నోటు ఇవ్వకుండా ఎన్నికల్లో గెలవడం దాదాపుగా అసాధ్యం. మరి, నిజాయితీగా ఉండే అభ్యర్థులు సొంత డబ్బులు, లేదా ఆస్తులు అమ్ముకొని మరీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఏకం తరఫున పోటీ చేయాలి అనుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయినా సరే, మన ఊరు.. మన పట్టణం బాగు చేయాలి అనే మంచి ఆలోచనతో కేకే మొదలుబెట్టిన ఈ ఏకం సక్సెస్ చేయడానికి ఎంతమంది ముదుకు వస్తారు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.

This post was last modified on October 3, 2026 3:03 pm

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

45 minutes ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

4 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

6 hours ago