ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే దాని మీద మార్కెట్ లెక్కలు ఆధారపడి ఉంటాయి. హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా ఇది వర్తిస్తుంది. గత ఏడాది ప్రదీప్ రంగనాధన్ డ్రాగన్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కయదు లోహర్ కు ఒకటి రెండు కాదు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు రేసులో వెనుకబడేలా చేశాయి. మమిత బైజు దూసుకుపోతున్న టైంలో ఈమెకిలా జరగడం ఫ్యాన్స్ ని బాధిస్తోంది.
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ తనకు మంచి ప్రమోషన్ అవుతుందని, గతంలో శ్రీవిష్ణుతో చేసిన ‘అల్లూరి’ గాయం మానుతుందని కయదు భావించింది కానీ దానికి భిన్నంగా నెగటివ్ ఫలితం దక్కింది. టోవినో థామస్ ‘పల్లిచట్టంబి’ ఇంకా దారుణంగా పోయింది. కనీసం పబ్లిసిటీ ఖర్చులు రానంత డిజాస్టర్ అయ్యింది. ‘ఇదయం మురళి’ తొలుత కొంచెం సౌండ్ చేసినా ఫెయిల్యూర్ లిస్టులోకే చేరింది. తమిళంలో యావరేజ్ దగ్గర ఆగిపోయింది కానీ మిగిలిన భాషల్లో పూర్తిగా వాష్ అవుట్ అయ్యింది.
దుల్కర్ సల్మాన్ ‘ఐ యాం గేమ్’ మరో చేదు జ్ఞాపకం. కంటెంట్ బలహీనతలు ఒకపక్క, ఇరుముడి ర్యాంపేజ్ మరోపక్క కలిసి థియేటర్ రన్ ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. జివి ప్రకాష్ కుమార్ జంటగా నటించిన వెరైటీ థ్రిల్లర్ ‘ఇమ్మొర్టల్’ సైతం సోసోగా ఆడి తన ఫిల్మోగ్రఫీకి ఎలాంటి మేలు చేయలేక చేతులు ఎత్తేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ‘ప్యారడైజ్’ మరో ఎత్తు. శ్రీకాంత్ ఓదెల సృష్టించిన సవారిల ప్రపంచంలో అత్యంత బలహీనమైన క్యారెక్టర్ తనదే అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద కూడా నాని సినిమాకు ప్రతికూల ఫలితం దక్కడం కయదుని నిరాశ పరిచింది. ప్రస్తుతం తన చేతిలో రెండు మలయాళం, ఒక సూర్య తమిళ సినిమా ఉన్నాయి. వీటిలో ఏదైనా బ్రేక్ ఇస్తే మళ్ళీ కెరీర్ ఊపందుకుంటుంది. 2021లో ఇండస్ట్రీకి వచ్చిన కయదు ఈ ఆరు సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు చాలా తక్కువ. అందం అభినయం రెండూ ఉన్నా సరైన హిట్టు దక్కక ఇబ్బంది పడుతోంది. మరి దశ ఎప్పుడు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 3, 2026 10:13 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…