కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 24 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. నాగార్జున, టబు తదితర ఆర్టిస్టులు పాల్గొంటున్న సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ మనీ థ్రిల్లర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండటం, భారీ బడ్జెట్ నిర్మాణం అంచనాలు పెంచుతోంది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ కింగ్ 100 కు సంబంధించిన మార్కెటింగ్ పక్కాగా చేసుకోవాలి. ఎందుకంటే దర్శకుడికి జనాల్లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ లేదు. తన పేరు మీద కొన్ని కోట్లు ఎక్స్ ట్రా బిజినెస్ జరిగేంత సీన్ లేదు. నాగార్జున, అన్నపూర్ణ సంస్థ, డీఎస్పి, ఇతర క్యాస్టింగ్ మీద క్రేజ్ తెచ్చుకోవాలి తప్పించి డైరెక్టర్ పరంగా ఎలాంటి అడ్వాంటేజ్ ఉండబోవడం లేదు. సో ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్స్ ఈ విషయంలో గట్టి డిమాండ్ వినిపిస్తున్నారు.
ఎప్పుడో సంక్రాంతికి వచ్చే జనవరి 12 విడుదల కోసం అనిల్ రావిపూడి క్రమం తప్పకుండా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి కాకా నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎటొచ్చి వాటికన్నా ముందు వచ్చే కింగ్ 100 నుంచి సాలిడ్ సౌండ్ వినిపించకపోతే హైప్ పరంగా ఇబ్బందవుతుంది. కుబేర, కూలిలో సపోర్టింగ్ రోల్స్ చేయడం ద్వారా అవసరం లేని రిస్క్ తీసుకున్న నాగార్జున ఇప్పుడు సోలో హీరోగా సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలి. అది కింగ్ 100తో జరగాలి.
లాటరీ టికెట్లు, మాఫియా తదితర నేరాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కింగ్ 100లో స్క్రీన్ ప్లే ప్రధానంగా చాలా ట్విస్టులు ఉంటాయట. అవి కనక కనెక్ట్ అయితే మటుకు ఓ రేంజ్ హిట్ పడుతుందని టీమ్ సభ్యులు చెబుతున్నారు. ఒకపక్క బిగ్ బాస్ రియాలిటీ షో షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకోవైపు కింగ్ 100తో బిజీగా ఉన్న నాగార్జున నెక్స్ట్ ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా తొలగలేదు. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ ఎవరిని ఫైనల్ చేయలేదు. కింగ్ 100 తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు.
This post was last modified on October 3, 2026 9:46 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…