Political News

ఆ సంస్థ‌తో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

`RAW NTR` పేరుతో `ఊరూవాడా` సామాజిక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నార‌ని.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తార‌ని పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారానికి… అస‌లు `RAW NTR` సంస్థ‌కు త‌న‌కు కూడా ఎలాంటి సంబంధం లేద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ కార్యాల‌యం ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన జారీ చేసింది. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను న‌మ్మ‌రాద‌ని విశ్వ‌సించ‌రాద‌ని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రో జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు.. ఎవ‌రో చెప్పిన మాట‌ల‌కు ఎన్టీఆర్‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఏకార్య‌క్ర‌మ‌మైనా.. త‌ల‌పెట్టాల‌ని అనుకుంటే.. ప్ర‌జ‌ల కోణంలో సామాజిక కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అనుకుంటే.. అవి నేరుగా ఎన్టీఆర్ కార్యాల‌యం నుంచే జ‌రుగుతాయ‌ని.. ఎలాంటి ప్ర‌క‌టన అయిన‌.. తారక్ ఆఫీసు నుంచి అధికారికంగానే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని.. వేరే సంస్థ‌ల‌తో మ‌ధ్య‌వ‌ర్తిత్త్వం అవ‌స‌రం లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఈ మేర‌కు తాజాగా మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఎన్టీఆర్ కార్యాల‌యం తెలిపింది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా స‌హా.. ప్రధాన మీడియాలోనూ ఈ నెల 18న `RAW NTR` పేరుతో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌జల మ‌ద్య‌కు వ‌స్తున్నారని, ఊరూ-వాడా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నార‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అంతే కాదు.. ఆ మ‌ర్నాడే.. ఈ వేదిక‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఓ పార్టీ స్థాప‌న విష‌యంపైనా ప్ర‌క‌ట‌న చేస్తారని వార్త లు వ‌చ్చాయి. దీనిపై ముందుగానే స్పందించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం రాజ‌కీయ పార్టీ వ్య‌వ‌హారానికి సంబంధం లేద‌ని పేర్కొంది.

ముందుగానే నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ నెల 18న ఊరూవాడా కార్య‌క్ర‌మం మాత్ర‌మే జ‌రుగు తుంద‌ని తెలిపింది. అయితే.. తాజాగా అస‌లు ఈ కార్య‌క్ర‌మానికి-ఎన్టీఆర్‌కు కూడా ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంటూ ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాన మీడియా స‌హా సోష‌ల్ మీడియా సంస్థ‌లుకూడా ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. త‌ప్పుదోవ ప‌ట్టించే వారి ప్ర‌క‌ట‌న‌లు విశ్వ‌సించ‌రాద‌ని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on July 14, 2026 11:49 pm

Share

Recent Posts

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

3 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

8 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

54 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

3 hours ago