యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఆ విదేశీయుడి కాలుని తాడుతో కట్టేసి గ్రామస్థులు, సాయుధ బలగాలు తీసుకెళ్తుండటం కనిపిస్తోంది. డాక్యుమెంట్లు లేకుండా దొంగదారిలో నేపాల్ లోకి జారుకోవడానికి ట్రై చేస్తుండగా జవాన్లు అతన్ని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తన పేరు జోర్డాన్ బ్రౌన్ అని, తన వయసు 36 ఏళ్లని చెప్పాడు. తాను అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని, గతంలో ఆరు సంవత్సరాల పాటు యూఎస్ నేవీలో పనిచేశానని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే తన మాటలను నిరూపించడానికి అతని దగ్గర ఎలాంటి ఐడీ కార్డులు లేవు. బోర్డర్ పిల్లర్ నంబర్ 516 దగ్గర తనిఖీలు చేస్తుండగా జవాన్లను చూసి పారిపోవడానికి చూసిన ఇతన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. అతని దగ్గర 31,460 రూపాయల క్యాష్ తో పాటు రెండు మొబైల్ ఫోన్లు దొరికాయి.
బ్రౌన్ చెప్పిన ట్రావెల్ హిస్టరీ వింటే ఇంటెలిజెన్స్ అధికారులకే మైండ్ బ్లాక్ అవుతోంది. టూరిస్ట్ వీసాతో థాయ్‌లాండ్ వెళ్లిన ఇతను అక్కడ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడట. ఆ తర్వాత సముద్ర మార్గంలో శ్రీలంక వెళ్లి, అక్కడి నుంచి 2025 నవంబర్ 2న దొంగచాటుగా ఇండియాలో అడుగుపెట్టాడు. అంటే దాదాపు ఎనిమిది నెలలుగా పాస్‌పోర్ట్ లేకుండానే గోవా, బెంగళూరు నగరాల్లో గుట్టుచప్పుడు కాకుండా తిరిగాడు. ఇప్పుడు యూపీ మీదుగా నేపాల్ వెళ్లాలనే ప్లాన్ తో వచ్చి దొరికిపోయాడు. దీనిపై సోనౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఈ అరెస్టుతో దేశ భద్రతా సంస్థల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే గత మార్చి నెలలో కూడా మ్యాథ్యూ ఆరోన్ వాన్ డైక్ అనే మరో అమెరికా సిటిజన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అతనితో పాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు కూడా మయన్మార్ బోర్డర్ ద్వారా మిజోరంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి పెద్ద కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఆ పాత గ్యాంగ్ కు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉండటమే కాకుండా వారికి ఆయుధాలు సరఫరా చేయడం, డ్రోన్లను అందించడం లాంటి పనులు చేసినట్లు తేలింది. వారిపై ఇప్పటికే ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఓ యూఎస్ నేవీ మాజీ సైనికుడు ఇండియాలో నెలల తరబడి తిరగడం వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
This post was last modified on July 14, 2026 12:32 pm
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…
కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…
మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…