సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఇందుకు భిన్నంగా అభిమాన రాజకీయ నేతను కలుసుకునేందుకు ఏకంగా రైలు ఎక్కి వచ్చేశాడు ఈ బాలుడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంటే ఎనలేని అభిమానం. తన మాటలలో తరచుగా తన అభిమానాన్ని వెలిబుచ్చేవాడు.
సాయి చందుకు చంద్రబాబు, లోకేష్ ను కలుసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో చెప్పకుండా తణుకు నుంచి రైలు ఎక్కి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరి కి వచ్చాడు. ఒంటరిగా అనుమానాస్పదంగా ఉన్న ఆ బాలుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందజేశారు. వారి సంబంధికులు రాగానే బాలుడిని అప్పజెప్తామని పోలీసులు తెలిపారు.
This post was last modified on July 13, 2026 11:17 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…