Movie News

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు విందు వడ్డించేసింది. ఇప్పుడు టాపిక్ ఇది కాదు. ఎలాంటి టికెట్ రేట్ల పెంపుకు వెళ్లకుండా రెగ్యులర్ ధరలతోనే ఈ ఫీట్ సాధించడం ఎగ్జిబిటర్లకు విపరీతమైన సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే చీటికిమాటికి ప్రతి సినిమాకు రేట్లు పెంచుకుంటూ పోవడాన్ని ఈ వర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. లెనిన్ పాటించిన స్ట్రాటజీ మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇదొక్కటే కాదు మా ఇంటి బంగారం అసలు టికెట్ రేట్ల ఆలోచనే అవసరం లేకుండా చక్కగా బిజినెస్ చేసుకుని వంద కోట్ల గ్రాస్ సాధించేసి టాలీవుడ్ మొదటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా రికార్డు అందుకుంది. అరుంధతి, మహానటిని దాటేసి నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంది. కుటుంబాలు వారంతో సంబంధం లేకుండా గంపగుత్తగా ఈ సినిమాకు వచ్చాయంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉండటమే. ఏపీలో ఒక అయిదుగురు సింగల్ స్క్రీన్ కు వెళ్తే అయ్యే ఖర్చు 500 రూపాయల లోపే.

తెలంగాణలోనూ మరీ తీవ్రంగా లేవు. మల్టీప్లెక్సులు కాస్త హైప్ ఉన్న సినిమాలకు 295 రూపాయలు పెట్టడం మాములే. ఎప్పుడైతే జిఓలు, పర్మిషన్లు అంటూ తెరమీదకు వస్తాయో అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పెద్దికి మూడు వందల కోట్లు వచ్చి ఉండొచ్చు. కానీ పది రోజుల పాటు పెంపు తీసుకోవడం చాలా ప్రేక్షకులను దూరం చేసిందన్నది వాస్తవం. మన శంకరవరప్రసాద్ గారు లాంటివి కూడా ఈ సమస్య వల్ల ప్రభావితం చెందాయి. ఇవన్నీ ఒప్పుకోవాల్సిన వాస్తవాలే.

అసలే నాలుగు వారాల ఓటిటి విండోతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే జనం ఇంత వ్యయ ప్రయాసలు పడి సినిమాలకు వస్తున్నారంటే దానికి కారణం అందుబాటు ధరలే. ఉల్లిపాయల రేట్ పెరిగితే కొన్ని రోజులు వాటిని వాడటం తగ్గించే మధ్యతరగతి కుటుంబాలు అత్యధికంగా ఉండే రాష్టాలు మనవి. వాళ్లకున్న ప్రధానమైన వినోదం సినిమానే. దాన్ని దూరం చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు. ఫుట్ ఫాల్స్ ఇంకా పెరగాలంటే లెనిన్, మా ఇంటి బంగారం చూపించిన దారిలో వెళ్తే సరి.    

This post was last modified on July 14, 2026 6:49 am

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

3 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

5 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

5 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

6 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

7 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

7 hours ago