పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం.. రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏళ్ల కిందట ఒకసారి ఈ గేట్లు మార్చగా.. వాటిలో సుమారు 64 గేట్లు తుప్పుపట్టాయి. మరికొన్నింటికి వైరింగ్ దెబ్బతింది. దీంతో వాటిని మార్చే కార్యక్రమానికి కూటమి సర్కారు నడుం బిగించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 32 గేట్లను మార్చామని.. తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన వాటిని మార్చకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పుడు తాము కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క గోదావరే కాకుండా.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాము తీసుకున్నామని.. ఆరు నూరైనా ఈ ప్రాజక్టు తొలిదశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రాజెక్టులే రాష్ట్రానికి ఆర్థిక వనరులని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. వాటిని పూర్తి చేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు
కూటమి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ఒక మంచి మిత్రుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ యన కుడిభుజానికి ఆపరేషన్ అయిందని.. తాను ముంబై వెళ్లి పరామర్శించి వచ్చానని తెలిపారు. ఇప్పు డే ఆయన విధుల్లోకి వస్తానని చెప్పగా.. పూర్తిగా కోలుకున్నాకే రావాలని కోరినట్టు వెల్లడించారు. పవన్ కల్యాణ్ వంటి మిత్రులు కూటమికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం దక్కించుకుంటుందని.. మొత్తం అన్ని స్థానాల్లోనూ గెలిచినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on July 13, 2026 8:30 pm
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…