Political News

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించిన కేసులో అరెస్టు అయిన రావణ్ కు న్యాయ సహాయం చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్… తాజాగా ఓ ఇంటర్పవ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రశ్న రావణ్ తో తనకు అంతగా సంబంధాలేమీ లేవని చెప్పిన శ్రావణ్… రావణ్ కు అతడి కుటుంబం నుంచి కూడా పెద్దగా మద్దతు లేదని సంచలన వ్యాఖ్య చేశారు. రావణ్ వ్యవహారంలో విపక్ష వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని కూడా శ్రావణ్ ఆరోపించారు.

ప్రశ్న రావణ్ తో తనకు పెద్దగా స్నేహమే లేదని శ్రావణ్ తెలిపారు. ఆకివీడు వ్యవహారంలోనే తనకు రావణ్ తో పరిచయం అయ్యిందని, ఆ తర్వాత తన ఇంటర్వ్యూ కోసం రావణ్ తనను సంప్రదించారని తెలిపారు. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే తాను రావణ్ తో ఫోన్ లో మాట్లాడానని ఆయన తెలిపారు. అంతకుమించి రావణ్ తో తనకు ప్రత్యక్ష సంబంధాలేమీ లేవని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక ఓ బాధ్యత కలిగిన సామాజిక వేత్తగా, న్యాయవాదిగా మాత్రమే తాను రావణ్ కేసులను వాదించానని, అంతకుమించి రావణ్ తో తనకు మైత్రి లేదని ఆయన తేల్చేశారు. 

ఇక రావణ్ ఓ రేంజిలో ఎలివేట్ కావడానికి దారి తీసిన ఏలూరు బహిరంగ సభలో అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని శ్రావణ్ పేర్కొన్నారు. ఆ సభలో వేదిక మీదకు వచ్చేవారిలో రావణ్ పేరే లేదని ఆయన అన్నారు. ఆహ్వానితుల జాబితాలో పేరు లేకున్నా.. సభ నిర్వాహకుడిగా ఉన్న తన అనుమతి లేకుండానే రావణ్ వేదిక మీదకు వచ్చారని, అంతేకాకుండా తనకంటే ముందుగానే తన అనుమతి లేకుండా రావణ్ మైకందుకుని మరీ ప్రసంగించారని ఆయన ఆరోపించారు. అయితే వేడిపై శ్రవణ్ అన్న రమ్మంటేనే వచ్చానని రావణ్ మాట్లాడడం గమనార్హం. రావణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తేల్చేశారు. తాను నిర్వహించిన సభలో తన అనుమతి లేకుండా మాట్లాడిన రావణ్ అరెస్టు అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలు చూస్తుంటే జడ శ్రవణ్ ఈ కేసు నుండి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రావణ్ కు వైసీపీ మద్దతు పలుకుతున్న వైనంపైనా శ్రావణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదికార కూటమికి చెందిన కీలక నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్న ప్రతి ఒక్కరికి వైసీపీ నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. అందులో భాగంగానే రావణ్ కు వైసీపీ నుంచి మద్దతు లభించిందని ఆయన అన్నారు. అయితే రావణ్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిన తర్వాత వైసీపీ అతడి నుంచి దూరం జరగాలని భావించిందని, అయితే అది అంత ఈజీ కాదన్న విషయం తెలుసుకుని వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తనకు మాత్రం వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు లేదని ఆయన అన్నారు. ఎంగిలి మెతుకులనూ విదల్చని మాదిరిగా వ్యవహరిస్తున్న వైసీపీ నుంచి తనకు ఎలాంటి సాయం అవసరం లేదని కూడా ఆయన ఘాటు వ్యాఖ్య చేశారు.

ఇక రావణ్ వ్యవహారంలో పరిమితికి మించి స్పందిస్తున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారంపైనా శ్రావణ్ స్పందించారు. రావణ్, ప్రకాశ్ రాజ్ ల మధ్య చాలా కాలం నుంచే పరిచయం ఉన్నట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. రావణ్ గురించి మాట్లాడేందుకే ప్రకాశ్ రాజ్ తనకు పలుమార్లు కాల్ చేశారని ఆయన చెప్పారు. ఇక రావణ్ కు అతడి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేదని చెప్పారు. రావణ్ కు న్యాయ సహకారంతో పాటుగా ఇతరత్రా సాయాన్ని కూడా తానే చేస్తున్నానని తెలిపారు. రావణ్ కు అన్నీ తానై సాయం చేస్తుంటే… అతడి బృందంలోని గమన అనే యువతి వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తీరుపై శ్రావణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

This post was last modified on July 11, 2026 4:55 pm

Share

Recent Posts

అక్క‌డ వైసీపీ జీరో నుంచి మొద‌లెట్టాల్సిందే

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వేళ ప‌రిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి…

41 minutes ago

తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…

6 hours ago

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని..…

6 hours ago

వైబ్ సరిపోవడం లేదు తమన్ సాబ్

ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…

7 hours ago

ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్‌?

బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘ‌ట‌న ఇప్పుడు దేశ్యాప్తంగా సంచ‌లనం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలో ఫుట్…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్‌ని తవ్వుతున్న కాకా

సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…

9 hours ago