పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది. జామీనుతో పాటు రూ.లక్ష పూచీకత్తు, కోర్టు నిర్దేశించిన షరతుల ప్రకారం భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. అంతేకాదు, పోలీసుల విచారణ ఏ రకమైన ఆటంకం కలిగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించిన సాక్షులను, బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని బండి భగీరథ్‌ను ఆదేశించింది. విచారణకు అవసరమైన సమయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు నిర్దేశించిన షరతులు ఉల్లంఘించిన నేపథ్యంలో భగీరథ్ బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, భగీరథ్ కు బెయిల్ మంజూరు కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ దేశంలో పెద్దవాళ్లకు ఒక న్యాయం…పేదవాళ్లకు ఒక న్యాయం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదే తరహాలో భగీరథ్ కేసు తర్వాత పోక్సో కేసులు పలువురు అరెస్టయ్యాయరని, వారికి బెయిల్ మంజూరు చేయలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పోక్సో కేసులో విచారణ తొలి దశలో ఉన్న సమయంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇటువంటి పరిణామాలతో బాలికల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 9, 2026 5:27 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…