Political News

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చీటింగ్ స‌హా.. న‌మ్మ‌క ద్రోహం, రెచ్చ‌గొట్ట‌డం, కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం వంటి ఆరోప‌ణ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని ఆమె పోలీసుల‌కు విన్న‌వించారు. లేక‌పోతే.. తాను హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు సోమ‌వారం గ‌న్న‌వ‌రం పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చిన సుగాలి ప్రీతి త‌ల్లి.. పోలీసుల‌కు లిఖిత పూర్వ‌క ఫిర్యాదును అందించారు.

ఏం జ‌రిగింది?

2017-18 మ‌ధ్య ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన సుగాలి ప్రీతి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో ఆమె చ‌దువుతున్నారు. ఆమెపై లైంగిక దాడి జ‌రిగి.. త‌ర్వాత హ‌త్య కూడా చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ వ్య‌వ‌హారం… 2019 ఎన్నిక‌లు స‌హా.. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ సుగాలి ప్రీతి త‌ల్లిని ఆమె ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. తాను అధికారంలోకి రాగానే.. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చిన‌ట్టు పార్వ‌తీదేవి చెబుతున్నారు.

అయితే.. కూట‌మి అధికారంలోకివ‌చ్చి.. రెండేళ్ల‌యినా.. త‌న‌కు న్యాయం చేయ‌లేద‌ని.. క‌నీసం త‌మ కుటుంబానికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి భ‌రోసా కూడా రావ‌డం లేద‌ని పార్వ‌తీదేవి త‌ర‌చుగా విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. చేశారు. గన్నవరం పోలీసులను ఆశ్రయించిన సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి.. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వ‌క ఫిర్యాదు చేశారు.

అధికారంలోకి వస్తే మొదటి సంతకం ‘సుగాలి ప్రీతి’ కేసుపైనే పెడ‌తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌న‌కు హామీ ఇచ్చార‌ని పార్వ‌తీ దేవి వ్యాఖ్యానించారు. అయితే.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట మార్చారని ఆమె ఆరోపించారు. పైగా త‌న‌పై ఓ పార్టీకి చెందిన నాయ‌కులు వేధింపులకు పాల్ప‌డుతున్నార‌ని ఆమె చెప్పారు. ఈ విష‌యంలో పోలీసులు త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆమె కోరుతున్న‌ట్టు తెలిపారు. వారు న్యాయం చేయ‌క‌పోతే.. హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని తెలిపారు. 

This post was last modified on July 6, 2026 3:08 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

3 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

8 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

10 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

10 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

12 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

13 hours ago