వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ బ్రేక్ వేసింది కానీ లేకపోతే ట్రాక్ రికార్డు మరింత వెలిగేది. స్వతహాగా దర్శకుడైన ప్రదీప్ తనకు హీరోగా ఆఫర్స్ ఎక్కువగా రావడం వల్ల డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు.ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి దిగిపోయాడు. ఇవాళ చిన్న వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇదంతా మాములు విషయమే కదా అని అనుకోవచ్చు.
అసలు ట్విస్టు వేరే ఉంది. ఈ సినిమాకు ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు దర్శకులు ఒక బృందంగా పని చేయబోతున్నారు. వాళ్లకు అల్ఫా యూనిట్ అని నామకరణం చేసిన ప్రదీప్ రంగనాథన్ తన ప్రొడక్షన్ కి PRS 01 అని పెట్టాడు. అనే వాలా స్టార్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు క్యాప్షన్ చూస్తే అర్థమవుతోంది. మమిత బైజు, శ్వాసిక తదితరులతో పాటు మన టాలీవుడ్ శివాజీ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఉండరు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. మరో దర్శకుడు అశ్వత్ మరిముత్తుకో కీలక పాత్ర ఇచ్చారు. ఇది ఒకరకంగా ప్రయోగమని చెప్పాలి. ఎందుకంటే ఒక దర్శకుడికి ఎంత మందైనా అసిస్టెంట్లు ఉండొచ్చు. కానీ ఒక సినిమాకు ఆరుగురు దర్శకులు ఉండటం రేర్. అందరికీ గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రదీప్ రంగనాధన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. పోస్టర్, సెటప్ చూస్తుంటే ఇది రెగ్యులర్ రామ్ కామ్ లా అనిపించడం లేదు. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వయొలెన్స్ ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.
తమిళ తెలుగు భాషల్లో రూపొందబోయే ఈ పిఆర్ఎస్ 01 షూటింగ్ మొదలైపోయింది. తెలుగులో రామ్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు దర్శకులుగా మారుతుంటే, దర్శకుడిగా మొదలై హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ కొత్త పాత్రలో ఏ మేరకు మెప్పించబోతున్నాడో చూడాలి. ఇప్పటిదాకా కేవలం యూత్ ని లక్ష్యంగా పెట్టుకుంటూ వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఈసారి మాస్ వర్గాలను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు అవసరమే.
This post was last modified on July 6, 2026 12:24 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…