కమల్ హాసన్ రీప్లేస్ చేసే స్థాయి నటుడు అంటూ ఇటీవల సత్యదేవ్ గురించి దర్వకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్ చాలామందికి అతిగా అనిపించింది. ఆ పోలిక తప్పు కావచ్చేమో కానీ.. సత్యదేవ్ సూపర్ పెర్ఫామర్ అనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఇప్పటిదాకా సత్యదేవ్ హీరోగా చేసిన సినిమాల్లో చాలా వరకు ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ నటుడిగా మాత్రం అతను ఎప్పుడూ ఫెయిలైంది లేదు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని సైతం డామినేట్ చేసే స్థాయిలో పెర్ఫామ్ చేశాడు అంటే అతిశయోక్తి కాదు.
ఐతే సత్యదేవ్‌కు ప్రతిసారీ నటుడిగా మంచి పేరు వస్తుంటుంది కానీ.. తన సినిమాలు మాత్రం పెద్దగా ఆడవు. బాగా లేని సినిమాలు ఆడలేదంటే ఓకే కానీ.. బాగుండి కూడా ఆశించిన ఫలితాలు అందుకోని సినిమాలు తన కెరీర్లో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్లఫ్ మాస్టర్, తిమ్మరసు, జీబ్రా లాంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వాల్సినవి కావు. హిట్ కావాల్సిన కంటెంట్ ఉన్నవే. కానీ రకరకాల కారణాలతో అవి ఆడలేదు.
ఇక సత్యదేవ్ కొత్త సినిమా ‘రావు బహదూర్’ విషయానికి వస్తే.. కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా, కొత్తగా అనిపిస్తున్నా సరే.. ఇది ఇంటలిజెంట్ ఆడియన్సుకి మాత్రమే అర్థమయ్యే సినిమా అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సత్యదేవ్ క్యారెక్టరైజేషన్, తన గెటప్స్, హావభావాలు అన్నీ వావ్ క్రేజీగా అనిపిస్తున్నాయి. పెర్ఫామెన్స్ విషయంలో అతను అద్భుతం చేయబోతున్నాడని అర్థమవుతుంది.
కానీ ఈసారి సత్యదేవ్ పెర్ఫామెన్స్ సూపర్, మంచి సినిమా అనే పేరు వస్తే సరిపోదు. సినిమాకు వసూళ్లూ రావాలి. ఎంతో ప్యాషన్‌తో టీం పడ్డ కష్టానికి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రావాలి. ఈ సినిమాను నిర్మించడం ద్వారా మహేష్ బాబు తన అభిరుచిని చాటుకున్నాడు. ఆయన సినిమా కావడంతో పబ్లిసిటీ కొంచెం గట్టిగానే చేస్తున్నారు. మరి సినిమాకు కేవలం విమర్శకుల ప్రశసంలు మాత్రమే కాకుండా.. కలెక్షన్ల వర్షమూ కురిసి కమర్షియల్ హిట్ కోసం సత్యదేవ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందేమో చూడాలి.
This post was last modified on July 2, 2026 6:41 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…