సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు చెందిన యాక్టివిస్ట్ లు ఫిక్స్ అయిపోతుంటారు. వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా జగన్ కూడా ఆ రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. జగన్ కామెంట్లతో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటుంటారు. అయితే, ఈ సారి జగన్ ఏ కామెంట్ చేయకుండానే ట్రోలింగ్ కు గురవుతున్నారు.
తాజాగా అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ జగన్ చేసిన కామెంట్లపై ఓ పక్క జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వెరైటీగా ఈ సారి ఓ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా జగన్ వెళ్లిన వైనంపై కూడా ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. సార్ మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని వెళ్లిపోయినట్లేనా అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండానే జగన్ లేచి వెళ్లిపోయిన వైనం విమర్శలకు తావిచ్చింది.
దీంతో, ఆ ప్రశ్నకు జవాబివ్వకుండా జగన్ లేచి వెళ్లిపోతున్నాడు కాబట్టి వైజాగ్ రాజధాని కూడా వెళ్లిపోయినట్లే అంటూ జనసేన తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ట్రోల్ చేసింది. ఆ ప్రశ్న వినిపించినా కూడా వినిపించనట్లుగా కమల్ హాసన్ ను మించిన యాక్టింగ్ చేస్తూ జగన్ అక్కడి నుంచి జారుకున్న తీరుపై ట్రోలింగ్ జరుగుతోంది.
2019-24 మధ్య తన హయాంలో విశాఖను ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటూ అక్కడి నుంచే పాలన అని ప్రచారం చేసిన జగన్ ఈ రోజు విశాఖ సంగతేంటి అని అడిగితే నోరు మెదపక పోవడం ఆయన నిలకడలేనితనానిని నిదర్శనమని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. భవిష్యత్తులో మావిగన్ గురించి ప్రశ్న అడిగితే…త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు జగన్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోతారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates