Political News

న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. చంద్ర‌బాబు పోస్టు వైర‌ల్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో ఇటీవ‌ల కాలంలో మ‌మేక‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసిన ఓ వీడియో అంద‌రినీ క‌డుపుబ్బ న‌వ్విస్తోంది. ఈ వీడియోకు స్వ‌యంగా చంద్ర‌బాబే.. ‘న‌వ్వ‌కుండా ఉండ‌లేరు’ అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్‌గా మారింది.

ఏంటా వీడియో..

క‌లెక్ట‌ర్ కుర్చీలో ఓ చిన్నారి కూర్చున్నాడు. త‌న‌ముందున్న నేమ్ ప్లేట్‌పై ‘ఆర్నా ఐఏఎస్‌’ అని రాసుంది. ఈ స‌మ‌యంలో ఆ చిన్నారి ముందు ఓ ల్యాప్‌ట్యాప్‌, ఓ పుస్త‌కం కూడా ఉన్నాయి. పుస్త‌కంపై ఏదో రాసుకుంటూ.. ల్యాప్‌ట్యాప్‌లో చూస్తూ.. సీఎం చంద్ర‌బాబుతోనే వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న‌ట్టుగా ఆ వీడియో స్ప‌ష్టం అవుతుంది. అయితే.. ఈ దృశ్యాన్నంతా ఆ చిన్నారి తండ్రి కిటికీలోంచి చూస్తున్నాడు.

దీనిని గ‌మ‌నించిన చిన్నారి.. ఆ వెంట‌నే వీడియో కాన్ఫ‌రెన్సు ముగిసిందంటూ ల్యాప్‌ట్యాప్‌ను క్లోజ్ చేస్తాడు. అంతేకాదు.. ‘బై సీబీఎన్ అంకుల్‌. ఇప్పుడు మీతో నేను మాట్లాడ‌లేను.’ అని వ్యాఖ్యానిస్తాడు. అనంత‌రం తండ్రి త‌న వ‌ద్ద‌కు రాగానే పాదాల‌కు న‌మ‌స్కరిస్తాడు. అయితే.. ఈ మొత్తం వీడియోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తోనే రూపొందించారు.

ఈ వీడియోను త‌న ఎక్స్‌లో పోస్టు చేసిన చంద్రబాబు.. దీనిని చూసిన వారు న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా ముఖ్య‌మంత్రి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. వాస్త‌వానికి పాల‌నా ప‌ర‌మైన‌, రాజ‌కీయ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌తో ఒత్తిడిగా ఉండే చంద్ర‌బాబు.. ఇలా.. స‌ర‌దా పోస్టుల‌ను కూడా చూస్తార‌ని.. వీటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, మారుతున్న కాలంలో అంద‌రికీ చేరువ అయ్యేలా చంద్ర‌బాబు మారుతున్నార‌న‌డానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

This post was last modified on June 26, 2026 5:38 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago