Political News

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం అయిందని విమర్శిస్తున్నారు. ఇలా, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పుట్టా మహేష్ వాపోయారు. తనకు రోజుకు కనీసం 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్లకు సంబంధించినవే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుల విషయంలో తమ మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం వారికి సపోర్ట్ చేయాలని కూడా సెలవిచ్చారు. అయితే, పోలీసులు కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని, రూల్స్ కు విరుద్ధంగా వెళ్లమని తాను చెప్పడం లేదని అన్నారు.

కానీ, అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చలాన్ల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు. స్థానిక నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఏవైనా చిన్నా చితకా విషయాలకు సంబంధించి స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ హెచ్ వో వారికి సపోర్ట్ చేసేలా చూడాలని ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు.

దీంతో, ఇదేం లాజిక్ అంటూ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విన్నపాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని, అలా కాకుండా మీడియా ముందు ఇలా మాట్లాడితే పార్టీకి డ్యామేజీ జరుగుతుంది అన్న విషయం మహేష్ మరిచారని విమర్శిస్తున్నారు.

This post was last modified on June 25, 2026 3:29 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

41 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago