Political News

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 207 స్థానాలు గెలుచుకోగా, అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 సీట్లతో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శిబిరానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 62 మంది ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.

దీనికి తోడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాతో పాటు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లాంటి కీలక పదవులను కూడా ఆమె వర్గం కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పేరు, ఆస్తులు, ఎన్నికల గుర్తు ఎవరికి దక్కాలనే దానిపై రెండు వర్గాల మధ్య అధికారిక పోరు మొదలైంది. పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న రీతబ్రత బెనర్జీ వర్గం ఒక అడుగు ముందుకు వేసి సంచలన నిర్ణయం తీసుకుంది.

మమతా బెనర్జీని పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి, ఆ స్థానంలో ఎమ్మెల్యే అరూప్ రాయ్ కు బాధ్యతలు అప్పగించింది. అసలైన పార్టీ తమదే అని చెబుతూ కొత్త ఆఫీస్ బేరర్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీనికి కౌంటర్ గా మమత వర్గం కూడా తానే చైర్ పర్సన్ గా కొనసాగుతున్నట్లు మరో లిస్ట్ ను ఈసీకి పంపించింది. తిరుగుబాటు నేతలది మైనారిటీ జాబితా అని ఆమె వాదిస్తున్నారు. రెండు వర్గాలు పార్టీ అధికారిక గుర్తు అయిన రెండు పువ్వుల సింబల్ తమకే దక్కాలని పట్టుబడుతుండటంతో ఈ వివాదం కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు చేరింది.

ఒక గుర్తింపు పొందిన పార్టీ చీలిపోయి రెండు వర్గాలు పార్టీ పేరు, గుర్తు కోసం క్లెయిమ్ చేసినప్పుడు అసలైన పార్టీ ఎవరిది అని తేల్చడానికి ఎన్నికల సంఘం టూ వింగ్ టెస్ట్ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 లోని పారాగ్రాఫ్ 15 ప్రకారం ఈసీకి ఈ పవర్ ఉంటుంది. ఇందులో భాగంగా చట్టసభల్లో ఎంతమంది సభ్యుల మద్దతు ఉంది, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎవరి బలం ఎక్కువ ఉంది అనే రెండు అంశాలను ఈసీ పరిశీలిస్తుంది. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయినప్పుడు కూడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకే ఈసీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దానికి ముందు 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు కూడా సుప్రీం కోర్టు ఇదే విధానాన్ని సమర్థించింది.

ఇక ఈ పరిణామాలను గమనిస్తే, ప్రస్తుతం టీఎంసీలోని 81 శాతం మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వర్గం వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ టెస్ట్ లో ఇది రీతబ్రత బెనర్జీ వర్గానికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే వరకు పార్టీ ప్రైమరీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 676 కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్ లోనే ఉంటాయి. త్వరలో జరగబోయే కోల్ కతా మున్సిపల్ ఎన్నికల లోపు రెండు వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ ఆస్తులపై ఎవరికి హక్కు ఉంటుందనేది లీగల్ గా తేలుతుంది. పార్టీ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందనేది ఇప్పుడు కోల్ కతాలో కాకుండా ఢిల్లీలో డిసైడ్ కానుంది.

This post was last modified on June 24, 2026 9:37 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

9 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

15 hours ago