సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. అన్ని కేంద్రాల మెయిన్ థియేటర్లు డెబ్భై శాతం దాకా ఆడియన్స్ ని నింపుతుండగా కింది సెంటర్స్ లో నలభై నుంచి యాభై దాకా ఈ నెంబర్ మారుతోంది. సాయంత్రం, సెకండ్ షోలు బాగా ఉన్నాయి. నిన్న వారం భయపెట్టిన వర్షాలు ఈసారి బ్రేక్ ఇవ్వడం బంగారంకు కలిసి వస్తోంది. ప్రస్తుతం డెబ్భై అయిదు కోట్లను టార్గెట్ చేసుకుంది.
ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏమీ లేవు. హనుమాన్ 3డి, ఒక్కడు, సినిమా చూపిస్త మావా, కన్నప్పలను గంపగుత్తగా దింపుతున్నారు కానీ దేనికీ కనీస బజ్ లేదు. అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ ఎక్స్, ఇన్స్ టాలో కనిపిస్తున్నాయి. ఉన్నంతలో హనుమాన్ టీమ్ ప్రమోషన్లు విస్తృతంగా చేస్తోంది కానీ 3డి ఎక్స్ పీరియన్స్ కోసం జనం పెద్ద ఎత్తున తరలి వస్తారా అనేది భేతాళ ప్రశ్నగా మారింది. రేపు డీసెంట్ గా ఓపెన్ అయితే మంచిదే.
ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే శుక్రవారం మొహరం సెలవు రోజుతో కలుపుకుని మొత్తం మూడు రోజుల లాంగ్ వీకెండ్ స్వాగతం చెబుతోంది. సో సమంత మళ్ళీ వసూళ్ల ప్రవాహం కొనసాగించవచ్చు. పెద్ది ఫైనల్ రన్ కు వచ్చేసింది. ఎంతో కొంత శని ఆదివారాల్లో లాగినా మరీ చెప్పుకోదగ్గ పెద్ద నెంబర్ ఉండకపోవచ్చు.
బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ దాటేసిన మా ఇంటి బంగారం ఏరియాల వారిగా లాభాలు తెచ్చే పనిలో ఉంది. నిర్మాణ సంస్థ అధిక శాతం ఒన్ రిలీజ్ చేసుకోవడంతో కాసుల గలగలలు సమంత ట్రలాల సంస్థను ముంచెత్తబోతున్నాయి. ఇంకా చూడాల్సిన కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. టికెట్ రేట్లు పెంచుకునే గోల లేదు కాబట్టి హ్యాపీగా రెగ్యులర్ ధరలతోనే జనం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ పెరిగేందుకు దోహదం చేసిన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.
This post was last modified on June 25, 2026 4:11 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…