Political News

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఈ రోజు సిట్ అధికారులు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సాయికృష్ణ లాకప్ డెత్ వాస్తవమేనని సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించి కోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనం రేపుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు మాయం చేశారని తమ నివేదికలో సిట్ అధఇకారులు వెల్లడించారు.

కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ మృతిచెందాడని, సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశ్యపూర్వకంగానే డిలీట్ చేశారని అధికారులు తేల్చారు. మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు తెచ్చారని, అయితే, కస్టడీకి అప్పగించిన తర్వాత అతడి ఆచూకీ దొరకలేదని తెలిపారు. చట్టవిరుద్ధంగా అతడిని కస్టడీలో ఉంచారని చెప్పారు. సాయికృష్ణను మే 6-8 తేదీల్లో స్టేషన్ లో చూశానని ఎస్ ఐ చెప్పారని తెలిపారు. అంతేకాదు, స్టేషన్లో సాయికృష్ణను అపస్మారక స్థితిలో అతడి తల్లి చూశారని వెల్లడించారు.

సాయికృష్ణ మృతదేహాన్ని పూడ్చేందుకు లేదా తగులబెట్టేందుకు సీఐ నాగరాజు విశ్వప్రయత్నాలు చేశారని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. అయితే, సాయికృష్ణ మృతదేహం ఇంకా లభించలేదని తమ నివేదికలో పేర్కొన్నారు. డెడ్ బాడీని ఏం చేశారు అనే విషయంపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందన్నారను. దర్యాప్తునకు నాగరాజు సహకరించడం లేదని, తప్పుడు సమాచారంతో కేసును పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని తెలిపారు.

This post was last modified on June 24, 2026 2:45 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

5 hours ago