Movie News

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించే చిత్రంలో రజినీ కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టింది చిత్ర బృందం.

కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా విషయంలో ఇన్నాళ్లూ విపరీతమైన సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో మీడియాకు, అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే టీం ఇలా ప్లాన్ చేసిందన్నది స్పష్టం. ఈ సినిమాకు ముందు సుందర్.సిని, ఆ తర్వాత శిబి చక్రవర్తిని దర్శకులుగా అనుకున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తప్పుకున్నారు. సుందర్ అధికారిక ప్రకటనతోనే ఈ ప్రాజెక్టుకు దూరం కాగా.. శిబి విషయంలో స్పష్టత కొరవడింది.

ఐతే ఈ ఇద్దరు తప్పుకోవడానికి కారణాలేంటో రజినీనే స్వయంగా వెల్లడించారు. అంతే కాక ఈ ఇద్దరి కంటే ముందు మరో దర్శకుడు కూడా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారంటూ షాకింగ్ విషయం చెప్పారు రజినీ. సూపర్ స్టార్‌తో పడయప్పా లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ను ముందు ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆయనకు కథ సెట్ కాక ఈ సినిమా నుంచి తప్పకున్నారట.

తర్వాత సుందర్‌‌ను ఎంచుకున్నామని.. కానీ ఆయనకు వేరే కమిట్మెంట్ ఉండడం వల్ల తనతో చేసే సినిమా వల్ల ఆలస్యం అవుతుందేమో అని ఆయన తప్పుకున్నారని రజినీ వెల్లడించారు.

ఇక శిబి విషయానికి వస్తే అతను మంచి కథ రెడీ చేశాడని.. అందులో హీరోది న్యూక్లియర్ సైంటిస్ట్ క్యారెక్టర్ అని.. ఎన్నో దేశాల్లో చిత్రీకరణ జరపాలని.. చాలా టైం తీసుకునే సబ్జెక్ట్ అని.. పైగా సెన్సిటివ్ స్టోరీ కావడంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని.. అందుకే ఇప్పుడది వద్దు అని దాన్ని పక్కన పెట్టామని రజినీ తెలిపారు. చివరగా అశ్వత్ మారిముత్తు కథ అన్ని రకాలుగా ఓకే అనిపించి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నట్లు రజినీ వెల్లడించారు.

This post was last modified on June 24, 2026 3:31 pm

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

2 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

2 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

3 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

4 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

4 hours ago