Movie News

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్ కానగరాజ్ హీరోగా పరిచయమవుతున్న డిసి వైపు లేకపోలేదు. ఇవి కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలు వస్తున్నాయి కానీ అవేవి ప్రేక్షకుల ఫోకస్ లో పెద్దగా లేవు. వాటిలో జిడిఎన్ ఒకటి. అంటే  గోపాలస్వామి దొరస్వామి నాయుడు. మాధవన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ బయోపిక్ తెలుగు వెర్షన్ ని ఒరిజినల్ తో పాటు సమాంతరంగా ఆగస్ట్ 7 రిలీజ్ చేస్తున్నారు.

విచిత్రంగా మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎలాంటి ప్రచారాలు చేయకపోవడంతో అసలిది వస్తున్న సంగతే రిజిస్టర్ కానంత వీక్ గా ప్రమోషన్లలో వెనుకబడింది. భారతదేశంలో తొలి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టిన మహానుభావుడిగా జిడిఎన్ జీవితం ఒక స్ఫూర్తివంతమైన పుస్తకం లాంటిది. లెక్కలేనన్ని అవార్డులు గెలుచుకున్న ఈ గొప్ప ప్రతిభాశాలి లైఫులో ఎన్నో మలుపులు, డ్రామా ఉన్నాయి. వాటిని చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు కృష్ణ కుమార్ రామకుమార్.

జిడిఎన్ లో చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉంది. మాధవవ్ తో పాటు ప్రియమణి, సత్యరాజ్, జయరాం, దుశారా విజయన్, వినయ్ రాయ్, అదితి బాలన్ తదితరులు ఇందులో భాగం పంచుకున్నారు. గతంలో రాకెట్రి తీసిన నిర్మాతలే ఈ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించడం విశేషం. బడ్జెట్ భారీగానే పెట్టారు. స్వాతంత్రం నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేసి ఆర్ట్ వర్క్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంతా చేసి ఓపెనింగ్స్ రావాలంటే ప్రచార ఘట్టాన్ని బాగా డిజైన్ చేసుకోవాలి.

మాధవన్ తన వంతుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రభంజనం ఇంకా కొనసాగుతుండగానే జిడిఎన్ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. పైగా పెద్ద కాంపిటీషన్ స్వాగతం చెబుతోంది. మౌత్ టాక్ తోనే ఇలాంటి సినిమాలు నిలబడతాయి. మరి మాధవన్ ఈ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటే కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. లేదంటే ఎదురీదాల్సి ఉంటుంది. 

This post was last modified on August 5, 2026 5:25 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago