Movie News

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత.. తక్కువ సమయంలోనే బిజీ లిరిసిస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి తర్వాత అంత విద్వత్తు ఉన్న గేయరచయిత ఆయనే. ఆయన సాహిత్యంలో గొప్పదనం గురించి చెప్పడానికి చాలా ఉంది. కానీ అనంత మాట తీరు మాత్రం ఇటీవల తరచుగా వివాదాస్పదం అవుతోంది.

స్టేజ్ ఎక్కి మైక్ అందుకుంటే ఆయన మాటలు హద్దులు దాటిపోతున్నాయి. ఇటీవల ‘పెద్ది’ సినిమాలో ఐటెం సాంగ్ సాహిత్యం మీద విమర్శలు గుప్పించిన వాళ్ల మీద ‘ఐటెం గాళ్లు’ అనే పదప్రయోగం చేశారాయన. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘పెద్ది’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ఈ సినిమాను విమర్శించన వాళ్లను ‘దురదగాళ్లు’ అని తీర్మానించేశారు. అసలు విమర్శ అన్నదే ఉండకూడదన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉంటోంది.

‘పెద్ది’ ఈవెంట్లో ఈ ‘దురదగాళ్లు’ అనే పద ప్రయోగంతో ఆగిపోలేదాయన. వందల మందిని ఊచకోత కోస్తే.. సుమోలు గాల్లోకి లేస్తే.. అంటూ తెలుగులో వచ్చే కమర్షియల్ సినిమాల మీద పరోక్షంగా కౌంటర్లు వేశారు. ఇలాంటి సన్నివేశాలున్న సినిమాల్లో నటించిన హీరోల మీద కౌంటర్ వేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలుండడంతో దుమారం రేగింది. ఐతే ‘పెద్ది’ ఈ తరహా కమర్షియల్ సినిమా కాదని.. ఇదో అద్భుత ప్రయోగం అన్నట్లు మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలే గొప్ప అన్నట్లుగా ఆయన మాట తీరు సాగింది.

కానీ ఇలాంటి సినిమాలో కమర్షియల్ హంగుల్లో భాగంగా హీరోయిన్‌ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం.. సమయం సందర్భం లేకుండా ‘వారానికి వేయి’ అంటూ ఐటెం సాంగ్ పెట్టడం గమనార్హం. అక్కడ కమర్షియల్ హంగుల్లో భాగంగా వాటిని పెట్టినపుడు.. వందమందిని ఊచకోత కోయడం.. సుమోలు గాల్లోకి లేవడం అలాంటి హంగుల్లో భాగమే కదా. మరి ‘పెద్ది’లోని కమర్షియల్ అంశాలు తప్పు కానప్పుడు.. మిగతా వాటి మీద కౌంటర్లు దేనికి?

అసలు ‘పెద్ది’లో సందర్భం లేకున్నా ఐటెం సాంగ్ క్రియేట్ చేయడమే కాక.. అందులో ‘వారానికి వేయి.. నాకోసం దాయి.. నెలకోసారైనా నీకిస్తా ఈ హాయి’ అంటూ సాగే సాహిత్యాన్ని జోడించారు. ఈ లిరిక్స్ గురించి విమర్శలు వస్తే వాటిని తీసుకోలేక.. ఐటెం సాంగ్‌లో అలాంటి సాహిత్యమే ఉంటుందని.. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు ‘ఐటెం గాళ్లు’ అన్న ఆయన.. వేరే సినిమాల్లో కమర్షియల్ సన్నివేశాల గురించి కౌంటర్ వేయడం ఏం లాజిక్కో?

This post was last modified on June 24, 2026 3:28 pm

Share

Recent Posts

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

1 hour ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

3 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

3 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

3 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

4 hours ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

4 hours ago