Political News

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణను సాయం కోరారా? జగన్ కోరితే… ఆ మేర సాయం చేసేందుకు బాలయ్య అప్పటికప్పుడే ఒకే అనేశారా? ఉప్పూనిప్పు మాదిరిగా ఉండే ఈ ఇద్దరి మధ్య మాటలు కూడా కలిశాయా? జగన్ సాయం కోరితే.. బాలయ్య చేయందించారా?… ఇన్నేసి డౌట్లు ఒకేసారి వచ్చేశాయి. అయితే డౌటేమీ లేదు. బాలయ్యను జగన్ సాయం కోరారు. బాలయ్య కూడా ఆ సాయం చేశారు. ఫలితంగా ఓ ఆడబిడ్డ జీవితం పదిలంగా నిలబడింది.

జగన్, బాలయ్యల మధ్య జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. అనంతపురం జిల్లాకు చెందిన స్వప్న అనే యువతికి బోన్ కేన్సర్ సోకిందట. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడే ఈ వ్యాధి రాగా… ఆమెకు జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందట. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సతో ఆ బాలిక ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని వైద్యులు చెప్పారట. ఈ క్రమంలో ఒకానొక రోజు జగన్ వారి ఇంటికి వెళ్లారట. ఆ సందర్భంగా ఆ బాలిక అనారోగ్యం గురించి, వైద్యుల సలహా గురించి తెలుసుకుని ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారట.

దివంగత నందమూరి తారకరామారావు స్థాపించిన బసవతారకం ఆసుపత్రి ప్రస్తుతం బాలయ్య ఆధ్వర్యంలోనే నడుస్తోంది కదా. మరి ఈ ఆసుపత్రిలో చికిత్స కావాలంటే… అది కూడా ప్రత్యేక పర్యవేక్షణతో చికిత్స కావాలంటే బాలయ్య సాయం కోరాల్సిందే. అంతే.. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ తన వాళ్లతో బాలయ్యతో మాట్లాడించారట. సదరు బాలికకు వైద్యం అందించాలన్న జగన్ కోరికను జగన్ పరివారం ద్వారా విన్న బాలయ్య అందుకు సరేనన్నారట. ఇంకేముంది స్వప్నకు బసవతారకం ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స లభించింది. బోన్ కేన్సర్ నయం అయిపోయింది. ఆ బాలిక ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా చలాకీగా జీవిస్తోంది.

ఈ విషయాన్ని స్వప్ననే స్వయంగా వెల్లడించింది. బసవతారకం ఆసుపత్రి ఏర్పాటు అయి సోమవారం నాటికి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా బసవతారకం రజతోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరగగా.. ఈ వేడుకలకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్వప్న జగన్, బాలయ్యల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనను కళ్లకు కట్టేలా చెప్పింది.

Kumar

Recent Posts

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

17 minutes ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

1 hour ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

1 hour ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

4 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

7 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

11 hours ago