Movie News

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్ చేసేసిన ఆయన.. ఆ తర్వాత సరదాగా ఆ ట్రెండును కొనసాగిస్తున్నారు. చిరు లీక్స్ అంటూ వీటికి అభిమానులు ప్రత్యేకంగా పేరు కూడా పెట్టుకున్నారు. ఐతే చిరు లీక్స్ కేవలం తన సినిమాల విశేషాలకే పరిమితం కావడం లేదు.

ఆయన తాజాగా సమంత తల్లి కాబోతున్న విషయాన్ని కూడా తన ఎక్స్‌ పోస్టులో లీక్ చేసేశారు. సామ్, రాజ్ నిడిమోరు దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ఇటీవలే ప్రచారం జరిగింది. ‘మా ఇంటి బంగారం2 సక్సెస్ సెలబ్రేషన్స్‌‌కు వచ్చినపుడు సమంత అప్పీయరెన్స్ చూసిన వాళ్లకు మరింత క్లారిటీ వచ్చింది. ఐతే ఇంకా సామ్, రాజ్ అయితే అధికారికంగా విషయాన్ని ప్రకటించలేదు. ఈలోపు చిరు ఆ విషయాన్ని పరోక్షంగా లీక్ చేసేయడం విశేషం.

‘మా ఇంటి బంగారం’ పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో చిరు.. సమంత, రాజ్ దంపతులను తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు. చిరు ఈ సినిమా చూడడమే కాక అందులోని మంచి విషయాలను కొనియాడుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అలాగే రాజ్ జోడీకి తాను, సురేఖ బహుమతి అందిస్తున్న ఫొటోలు కూడా షేర్ చేశారు చిరు.

ఈ పోస్టు చివర్లో జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్న సమంత, రాజ్ దంపతులకు శుభాకాంక్షలు అంటూ వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు చిరు. మరోవైపు ‘మా ఇంటి బంగారం’ దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో సమంత తల్లి అవుతున్న విషయాన్ని ధ్రువీకరించింది. తమ సినిమా బ్లాక్ బస్టర్ అయిన టైంలోనే సమంత తల్లి కాబోతున్న శుభవార్త బయటికి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. ఇక సామ్, రాజ్ అధికారికంగా విషయం చెప్పడమే మిగిలుంది.

This post was last modified on June 23, 2026 12:18 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

23 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

27 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

1 hour ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago