Movie News

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ యూనానిమస్ రిపోర్ట్స్ రాలేదు. రివ్యూలు కొంత మిశ్రమంగా, ఎక్కువ పాజిటివ్ గా స్పందించాయి. అయితే వీటితో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి. ఆదివారం ముగిసేలోపు నలభై కోట్లు దాటేసిన సమంత సోమవారానికి హాఫ్ సెంచరీ క్లబ్బు క్రాస్ చేసి కొత్త మైలురాళ్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంకో వీకెండ్ కూడా కలిసి వచ్చేలా ఉంది.

జూన్ 26 రావాల్సిన లెనిన్ జూలై 10కి వెళ్లిపోవడంతో ఈ నెలాఖరు స్లాట్ ఖాళీగా ఉండిపోయింది. దీంతో రీ రిలీజులతో థియేటర్లను నింపేస్తున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందో గుర్తు చేసుకుంటే లెక్క ఠక్కున చెప్పలేని ‘ఒక్కడు’ మరోసారి రాబోతోంది. స్వయంగా మహేష్ బాబు అభిమానులే ఎన్నిసార్లు చేస్తారయ్యా అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. మంచు విష్ణు ‘కన్నప్ప’ ఏడాది దాటగానే వస్తున్నాడు. ప్రభాస్ క్యామియో మళ్ళీ మేజిక్ చేస్తుందేమో చూడాలి.

‘హనుమాన్ 3డి’ ఏదో కొత్త సినిమా అన్నంత హంగామా చేస్తున్నారు. కొత్త సాంకేతిక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని టీమ్ నొక్కి చెబుతోంది. మరి ఆడియన్స్ టర్న్ అయితే అదృష్టమని చెప్పాలి. ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించి జనం దృష్టిలో పడేలా చేసుకున్నారు. రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్త మావా’ కూడా నేను సైతం అంటూ బరిలో దిగుతోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కూడా రావాల్సింది కానీ నిర్మాత బండ్ల గణేష్ పెద్ది కోసం డ్రాప్ అయ్యారు.

వీటిలో ఏవి ఆడతాయో ఏవి ఆడవో ఈజీగా చెప్పేయొచ్చు. అయినా రీ రిలీజులు కూడా ఇలా అతివృష్టిలాగా ఒకేసారి మీద పడితే జనంలో మిగిలిన కాసింత ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇటీవలే గోపిచంద్ గౌతమ్ నందాని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా సౌండ్ చేయకుండా వెళ్ళిపోయింది. అంతకు ముందు కృష్ణ, ఊసరవెల్లి లాంటివి నోటీస్ లోకి రాకుండానే వెళ్లిపోయాయి. 2026 ఆరు నెలల కాలంలో చివరి వారం ఇలా కృష్ణార్పణం అయిపోయింది.

This post was last modified on June 23, 2026 9:18 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

46 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago