కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని వాడుకుని రాజకీయాలు చేయాలా? అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. అన్ని పార్టీల్లోనూ ఉన్నట్టుగానే.. వైసీపీలోనూ కొందరు తటస్థ నాయకులు ఉన్నారు. వారు.. జగన్ చెప్పారని గుడ్డిగా ఫాలో అయ్యే టైపు కాదు. ఇలాంటి వారు.. ఇప్పుడు ఈ విషయంలో జగన్‌కు కొన్ని సూచనలు చేశారని తెలిసింది.
గత నాలుగు రోజులుగా వైసీపీ అధినేత.. తన పార్టీ నాయకులతో వరుస సమావేశాలు పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రంలోని కాపులను విడదీయాలన్నది.. కొందరినైనా కూటమికి దూరం చేయాలన్నది ప్రధాన వ్యూహంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాపు నాయకులు, మాజీ మంత్రులతో ఇటీవల జగన్ సమావేశమయ్యారు. కాపులను మనవైపు తిప్పకపోయినా.. ఫర్వాలేదు. కూటమికి దూరం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగాలని వారికి హితవు పలికినట్టు సమాచారం.
దీనికి సంబంధించి అన్ని ప్రధాన మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. ఇక, ఈ విషయంపైనే ఈ నెల 21న ఉత్తరాంధ్రలో భారీ సభకు ప్లాన్ చేశారు. ఇది పూర్తిగా కాపుల కోసం.. కాపుల చేత అన్నట్టుగా నిర్వహిస్తున్న సభగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. గత ఎన్నికల్లో కాపులంతా ఏకమై.. కూటమిని బలపరిచారు. మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపులంతా పవన్ వెంటే నడిచారు. ఇది .. వైసీపీ అధికారా నికి గండి కొట్టింది.
ఇప్పుడు కూడా తాను అలానే వదిలేస్తే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి పరాభవం తప్పదని భావిస్తున్న జగన్.. కాపుల్లో అనైక్యతను పెంచి.. కూటమికి దూరం జరిపి.. తద్వారా తాను రాజకీయ మేలు.. పొందాలని భావి స్తున్నారు. అయితే.. దీనిని తటస్థ వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. ఇలా.. చేయడం సరికాదని.. కుదిరితే.. కాపులను కలివిడిగా పార్టీవైపు మళ్లించుకోవాలని.. చిచ్చు పెట్టడం ద్వారా.. వైసీపీ సాధించేది లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో భారీస్థాయి చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఇదే సామాజి క వర్గానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.
This post was last modified on June 20, 2026 8:54 am
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…