Movie News

పబ్లిసిటీ ఇంకాస్త పెరగాలి బాల

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ పంపిణి చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో సౌండ్ చేయడంలో సరైన శ్రద్ధ చూపకపోవడంతో అసలిది రిలీజైన విషయమే జనాలకు పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఫలితంగా చాలా సెంటర్లలో కనీస ఆక్యుపెన్సీలు లేక క్యాన్సిల్ చేయడమో లేదా వచ్చిన నాలుగురైదుగురికి షోలు వేయడమో జరిగాయట. మంజుమ్మల్ బాయ్స్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన చిదంబరం దీనికి దర్శకుడు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే బాలన్ కు నెగటివ్ రివ్యూస్ రాలేదు. తల్లి కొడుకు సెంటిమెంట్ చుట్టూ చిన్న క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ట్రీట్ మెంట్ జోడించి ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో డైరెక్టర్ విజయం సాధించారని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. సహజంగా మల్లువుడ్ మూవీస్ నెమ్మదితనం ఇందులోనూ ఉన్నప్పటికీ కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఇలాంటి కంటెంట్ ఇవ్వడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి.

అసలు సమస్య ఏంటంటే ఒక పక్క మా ఇంటి బంగారం మంచి స్వింగ్ లో ఉంది. బజ్ ముందు నుంచే ఉన్నప్పటికీ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పబ్లిసిటీ గ్రాండ్ గా చేశారు. బాలన్ డబ్బింగ్ అయినంత మాత్రాన ఇవి అవసరం లేదని అనుకోకూడదు. మొన్న వీరభద్రుడు ఎంత వసూలు చేసిందో మర్చిపోలేదుగా. కాకపోతే బాలన్ లాంటి వాటికి పుష్ అవసరం. జనాలకు తెలిసేలా దాన్ని బాగా ప్రమోట్ చేసుకుంటేనే ఇందులో ఏదో ఉందనే ఆసక్తి పబ్లిక్ లో కలుగుతుంది.

బాలన్ ఒరిజినల్ వెర్షన్ కు రెస్పాన్స్ బాగుంది. పెద్ద రేంజుకు వెళ్తుందా లేదానేది చెప్పలేం కానీ ఇప్పటికైతే ట్రెండింగ్ లో ఉంటూ జనంలో హాట్ టాపిక్ గా మారింది. ఎటొచ్చి తెలుగులో ఏం చేస్తుందనేది సోమవారానికి క్లారిటీ వస్తుంది. ఫర్జానా, ఆదిశేషన్ నటనకు క్లాప్స్ పడుతున్నాయి. ఇంటర్వల్, క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. వీకెండ్ కల్లా పికప్ అవుతుందని అంటున్నారు కానీ మరీ ప్రచారం లేకుండా అంటే ఇబ్బందే అవుతుంది. రెండు రోజుల్లో ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

This post was last modified on June 20, 2026 11:09 am

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago