Political News

‘బాబు, ప‌వ‌న్‌ల‌పై న‌మ్మ‌కం ఉంది’

వైసీపీ చేస్తున్న రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూ.. విజ‌యవాడ కృష్ణలంక‌లోని సాయికృష్ణ కుటుంబం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ కుమారుడు ఎక్క‌డున్నా తీసుకురావాల‌ని.. లేదా.. మృత‌దేహాన్న‌యినా.. అప్ప గించాల‌ని కోరుకుంటున్న‌ట్టు సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, మేన‌మామ‌లు తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు సంపూర్ణ స‌హ‌కారం ఉంద‌న్నారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మ‌కు న‌మ్మకం ఉంద‌న్నారు.

త‌మ‌కు జ‌రిగిన అన్యాయం వేరే ఏ కుటుంబానికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నామ‌న్నారు. సీఎం వెంట‌నే స్పందించి విచార‌ణ‌కు ఆదేశించార‌ని.. అలానే త‌మ‌కు న్యాయం చేస్తార‌ని న‌మ్ముతున్నామ‌ని విజ‌య‌లక్ష్మి చెప్పారు. కేసునిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం కూడా వ్య‌క్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై మాకు న‌మ్మ‌కం ఉంది. వారు మాకు న్యాయం చేస్తారు. ఈ నెల 29లోగా మా కుమారుడిని మాకు అప్ప‌గిస్తే చాలు అని విజ‌య‌ల‌క్ష్మి అన్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్య వాదాలు. సాయికృష్ణ అదృశ్యం అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారు. వెంట‌నే విచారణ‌కు ఆదేశించారు. మా ఇంటికి ఎమ్మెల్యే కూడా వ‌చ్చారు. ప్రభుత్వం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది. అని సాయికృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిని ఎవ‌రూ రాజ‌కీయ‌, కుల కోణంలో చూడ‌వ‌ద్ద‌ని.. వారు విజ్ఞ‌ప్తి చేశారు.

రంగంలోకి బృందం..

సాయికృష్ణ అదృశ్యం కేసుపై విచార‌ణ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించారు. ఈ బృందంలో స‌భ్యుడిగా ఉన్న ఏసీపీ దైవ ప్ర‌సాద్‌.. శుక్ర‌వారం ఉద‌యం కృష్ణ‌లంక‌లోని సాయికృష్ణ నివాసానికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో విజ‌య‌ల‌క్ష్మి ఆసుప‌త్రికి వెళ్లార‌ని తెలుసుకుని అక్క‌డే గంటసేపు చుట్టుప‌క్క‌ల వారిని విచారించారు. అనంత‌రం.. త‌ల్లి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు దైవ‌ప్ర‌సాద్‌ విచారణ కొన‌సాగించారు. కాగా.. శ‌నివారం నుంచి పూర్తిస్థాయి విచార‌ణ ప్రారంభం కానుంద‌ని తెలిపారు.

This post was last modified on June 19, 2026 10:00 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago