సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించే బాధ్యతను ఈ బృందానికి అప్పగించనున్నారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సీఐ నాగరాజుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయించారు. అనంతరం ఫిర్యాదు ప్రతిని విజయలక్ష్మికి అందజేశారు. కేసు దర్యాప్తు అధికారిగా దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కూడిన ప్రత్యేక బృందం ఈ రోజు సాయికృష్ణ నివాసానికి చేరుకుంది.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేయడంతో సీఐ నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 19, 2026 12:52 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…