Movie News

మూడో పుట్టినరోజుకైనా శుభవార్త చెబుతారా

2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు టీమ్ అలెర్ట్ అయిపోయి మొత్తం కంటెంట్ రిపేర్లు చేయడానికి పూనుకుంది. 2025 మెగాస్టార్ బర్త్ డేకి ఇంకో టీజర్ వదిలారు. ఇది కొంచెం పర్వాలేదనిపించింది కానీ మరీ మైండ్ బ్లోయింగ్ కాదు. ఈలోగా మన శంకరవరప్రసాద్ గారు విడుదలైపోవడం, బ్లాక్ బస్టర్ కావడం జరిగాయి. సరే ఇదంతా అయ్యాక కూడా విశ్వంభరలో చలనం కనిపించడం లేదు.

ఒకళ్ళేమో దసరా అంటారు. ఇంకొకరెమో ముందు బాబీ తీస్తున్న మెగా 158 సంక్రాంతికి విడుదలయ్యాక అటుపై వేసవిలో విశ్వంభర వస్తుందని అంటున్నారు. ఏది నిజమో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద బజ్ సున్నా అయిపోయింది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి హైప్ ని సృష్టించుకుంటూ రావాలి. అప్పుడెప్పుడో వదిలిన శ్రీరామ నవమి పాటకు కూడా స్పందన అంతంతమాత్రంగా వచ్చింది.

మొండిగోడల మీద వర్షం పడినట్టు విశ్వంభర మరీ ఇంత చలనం లేని స్ట్రాటిజిని ఎంచుకోవడం సరికాదు. హీరో ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనంలో ఒక సినిమా మీద అంచనాలు సజీవంగా ఉండాలంటే దాన్ని ఏదో ఒక రూపంలో పబ్లిక్ మాట్లాడుకునేలా చేయాలి. అవసరానికి మించి రాజమౌళి తన వారణాసిని ఎందుకు హై మార్కెటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఉన్నారని లైట్ తీసుకోలేదు. ఏడాది ముందు నుంచే సౌండ్ చేస్తున్నారు.

నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ పేకమేడలా కూలిపోతున్న విశ్వంభర బజ్ ని తిరిగి బ్రతికించే సంజీవని కేవలం అప్డేట్స్ మాత్రమే. ఏ పండగ వచ్చినా కనీసం పోస్టర్లు వదలడం లేదు. ఆర్టిస్టుల పుట్టినరోజులు వస్తే మొక్కుబడిగా విషెస్ తప్ప ఇంకేం ఉండవు. ఇంకో రెండు నెలల్లో ఆగస్ట్ 22 మళ్ళీ చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. అప్పటికైనా సాలిడ్ గా ఒక నిర్ణయం తీసుకుని శుభవార్త చెబుతారో లేక మేమింతే అంటూ పాత పద్ధతి కొనసాగిస్తారో చూడాలి.

This post was last modified on June 19, 2026 10:18 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago