రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్‌లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. రప్పా.. రప్పా అంటే.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ(వైసీపీ) పాలనకు .. ప్రజా పాలనకు తేడా గమనించాలని ఆయన సూచించారు. గత ఐదేళ్లలో జేసీబీలు వచ్చేవని, నడిరోడ్డుపై దాడులు చేసేవారని.. హత్యలు చేసేవారని.. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే.. బూతులతో విరుచుకుపడే వారని అన్నారు. ఇంట్లో ఉండే తల్లి, చెల్లి, భార్యను కూడా రోడ్డున పడేశారని.. సోషల్ మీడియాలో బూతులు తిట్టేవారని తెలిపారు. కానీ, ప్రజా పాలన వచ్చిన తర్వాత.. గత రెండేళ్లలో వీటిని లేకుండా చేశామని.. మహిళలు ఎంతో గౌరవంగా తిరిగే సంస్కృతిని పెంచుతున్నామన్నారు. పాఠశాల దశలోనే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పుతున్నామన్నారు. తద్వారా సమాజంబాగుండాలనేసంకల్పంతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలిపారు.
యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా లోకేష్ పంచుకున్నారు. తాను మైకులో మాట్లాడడానికి కూడా వీల్లేదని ఆంక్షలు పెట్టి .. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను కూడా హరించారని తెలిపారు. గొడ్డలి పార్టీ అనేక అరాచకాలకు పాల్పడిందన్నారు. రెడ్ బుక్ తెరిచే ఉందని దాని పని అది చేసుకుంటూ పోతుందని.. దీనిలో ఎవరినీ మినహాయించేది లేదని వైసీపీనాయకులను ఆయన హెచ్చరించారు.
ఎన్నో ఇబ్బందులు ఉన్నా..
గొడ్డలి పార్టీ చేసిన అప్పులు.. విధ్వంసంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయినప్పటికీ.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిస్తేనే.. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుం దన్నారు. ప్రజలను ఆదిశగా మలచే బాధ్యత పార్టీ కార్యకర్తలు, సీబీఎన్ ఆర్మీ తీసుకోవాలని లోకేష్ సూచించారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాదని.. ప్రజలు నమ్మకం, భరోసా కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
This post was last modified on June 12, 2026 3:18 pm
ప్రపంచం దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి వున్న పేరు ప్రమాదంలో పడిపోయింది. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం…
ది ప్యారడైజ్ టాక్, బాక్సాఫీస్ స్టేటస్, టాక్స్, రివ్యూస్ కాసేపు పక్కన పెడదాం. ఎక్కడిదాకా వెళ్తుందనేది తేలడానికి కనీసం వీకెండ్…
మనం ప్యారడైజ్ మేనియాలో పడిపోయాం కానీ తమిళంలో రేపు డోరోతి విడుదల కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పేట…
ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా…
డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే…
దానం నాగేందర్.. దూకుడు మొత్తానికే ముసలం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జరుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన…