Movie News

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు. చాలా సినిమాలు నిరాశపరిచాయి. వేసవిలో అక్షయ్ కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’ ఓ మాదిరిగా ఆడింది. దాని తర్వాత ట్రేడ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న సినిమా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతడికి జోడీగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లాంటి అందాల భామలు నటించారు.

ఒకేసారి తన ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేసి, ఆ ఇద్దరూ ప్రెగ్నెంట్ అయితే ఆ మగాడి పరిస్థితి ఏంటన్న కథాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్. ఐతే కామెడీ, రొమాంటిక్ ట్రాక్స్ కొంతమేర వర్కవుట్ అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్ కాలేదు.

యావరేజ్ రివ్యూలు, కలెక్షన్లతో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాలీవుడ్‌ను నిరాశకు గురి చేసింది. దీంతో పాటే మరో హిందీ మూవీ ‘బందర్’ కూడా రిలీజ్ కాగా.. అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఒకప్పుడు బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన కల్ట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంతో మళ్లీ తన సత్తా చాటాలనుకున్నాడు.

కానీ గత చిత్రాలతో పోలిస్తే మెరుగైన సినిమానే తీసినప్పటికీ.. ఈ చిత్రాన్ని చూడడానికి జనం థియేటర్లకు రాలేదు. బాబీ డియోల్ లాంటి క్రేజీ నటుడు లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. టాక్ బాగున్నా జనం ఈ సినిమాను చూడట్లేదు. ఐతే పేరున్న రెండు హిందీ చిత్రాలు నిరాశపరిచిన నేపథ్యంలో ‘పెద్ది’కి నార్త్ ఇండియాలో కలిసొస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు.

ఈ చిత్రం ఇప్పటిదాకా నార్త్ మార్కెట్లో రూ.18 కోట్ల మేర నెట్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ‘పెద్ది’కి రిలీజ్ ముంగిట నార్త్‌లో ఉన్న క్రేజ్ చూసి అద్భుతాలు చేస్తుందనుకుంటే.. వారం రోజుల్లో మరీ ఇంత తక్కువ వసూళ్లతో సరిపెట్టుకుంటుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఇకపై ఏమైనా సినిమా పుంజుకుని వసూళ్లు పెంచుకుంటుందేమో చూడాలి.

This post was last modified on June 12, 2026 3:27 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

11 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

30 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

34 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

4 hours ago