Political News

ఈసీ అస్తిత్వానికి భంగం కలుగుతుంది

ప్రపంచం దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి వున్న పేరు ప్రమాదంలో పడిపోయింది. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం తీవ్రమైన ఆరోపణల ఊబిలో కూరుకొనిపోయింది. ఇది ఆషామాషి ఆరోపణలు కూడా కావు మొత్తం ప్రజాస్వామ్య ఆస్తిత్వాన్నే కుప్పకూల్చేంతటి తీవ్రమైన ఆరోపణలు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెరవెనక ఏమి జరుగుతుందో తెలియదు కానీ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దూకుడు గురించి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఒక కథనం దేశంలో దుమారం లేపుతోంది.

భారత ఎన్నికల చట్టాలను పకడ్బంధీగా రూపొందించారు. ఈ చట్టాల ప్రకారం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం నిరంతరంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగేది. ఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. ఇప్పటివరకు భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఓటర్ల మార్పులు చేర్పులు, ధ్రువీకరణలపై అధికారం స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేతిలో ఉండేవి. ఇపుడా అధికారాన్ని ఢిల్లీలోని కేంద్ర ఐటీ విభాగం చేతికి ఇచ్చారు. ఇందులో భాగంగా ఈసీఐఎన్ యాప్ తీసుకొచ్చారు. ఈ నిర్ణయం అత్యంత వివాదంగా మారింది.

ఎన్నికల కమిషన్లో ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో పాటుగా మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి వున్నారు. కొత్త యాప్ గురించి ఈ ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపారు. జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై గత 10 నెలల్లో 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం వెలుగులోకి తెచ్చింది. ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఫారం -6 గురించి కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సర్ లో భాగంగా ఫారం -6లో చేర్చిన ప్రశ్న చట్ట విరుద్దమని కమిషనర్లు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అయినా ఆయన లెక్క చేయలేదట.

ఈసీ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నకిలీ ఓట్లు, చనిపోయినవారి ఓట్లను సవరించడం పేరుతో ఎస్ఐఆర్ (సర్ )ను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల ఓట్లను తొలిగించారు. ఒక సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేసి సర్ తీసుకోచ్చినట్లు ఆరోపణలు వచ్చినప్పటికి పూర్తిగా అది నిజం కాదని తేలింది. అయితే విపక్షాలకు సంబందించిన ఓట్ బ్యాంక్ ను దెబ్బ తీస్తున్నట్లు అనేక నేతలు ఆరోపణలు చేశారు. తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ దీనివల్లే ఓటమి పాలైనట్లు ప్రచారం జరుగుతుంది. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కూటమి మధ్య గెలుపోటముల వ్యత్యాసం కేవలం 2% మాత్రమే ఉందని, ఆ తేడాను ప్రభావితం చేయడానికే ఈ స్థాయిలో ఓట్లు తొలగించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గోవా కథ భిన్నంగా వుంది. గోవాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించాలంటే ఓటు హక్కు కలిగి ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభ్యంకాని డయాలిసిస్, యాంజియోప్లాస్టీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, ట్రాన్స్‌ప్లాంట్లు, కీమోథెరపీ వంటి సూపర్ స్పెషాలిటీ చికిత్సకు నిధులు సమకూర్చే ‘గోవా మెడిక్లెయిమ్ స్కీమ్’ ఈ రాష్ట్ర ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే గోవాలో అనర్హులుగా నిర్దారించిన 97 మంది ఓటర్లను తిరిగి నమోదు చేయడానికి ఈసీఐనెట్ సాఫ్ట్ వేర్ తీసుకోలేదు. దీన్ని సామాజిక కార్యకర్తలు సైతం తప్పు పడుతున్నారు.

ఇప్పటికే జ్ఞానేశష్ కుమార్ తొలగించాలని కోరుతూ 60 మందికి పైగా రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న పలు నిర్ణయాలను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించారన్న పెద్ద వార్త వెలువడిన నేపథ్యంలో ఆ తీర్మానాన్ని రాజ్యసభలో ముందుకు తీసుకురావాల్సిన సమయం ఇపుడు ఆసన్నమైందని రాజ్యసభ ఎంపీలు చెబుతున్నారు. రెండు రోజులోగా ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని కాక్రోచ్ నేత అభిజిత్ దీప్కే హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. విపక్షాలు మూకుమ్మడిగా ఈసీని తొలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు. తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్లి పోతున్నారు. దీనికి కారణం ఏమిటన్నదే సందేహంగా మారింది. దేశ ప్రతిష్టను, ప్రజా స్వామ్యాన్ని ఇంత పబ్లిగ్గా ఉరికంబం ఎక్కించడం వెనక బలమైన శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈసీ జ్ఞానేష్ కుమార్ ను ఉద్దేశించి కాక్రోచ్ అభిజిత్ దీప్కే తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈసీని దేశ ద్రోహి, దేశ ప్రజా స్వామ్యానికి ముప్పుగా పరిగనించారని విమర్శలు చేశారు. లోతుగా ఆలోచిస్తే అనేక సందహాలు కలుగకమానదు.

This post was last modified on September 25, 2026 6:18 am

Share

Recent Posts

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…

53 minutes ago

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

1 hour ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

1 hour ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

2 hours ago

శ్రీవిష్ణుకి ఫేవరేట్ హీరోతోనే పోటీ

టాలీవుడ్ రిలీజుల వ్యవహారం కేవలం ప్యాన్ ఇండియాలకే కాదు మీడియం సినిమాలకు సైతం ప్రాణ సంకటంగా మారింది. అక్టోబర్ 2…

2 hours ago

ఐబొమ్మ ర‌వికి ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్

పైర‌సీ వెబ్ సైట్ తో తెలుగు.. త‌మిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు…

6 hours ago