కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరసనలో పాల్గొన్నారు. ఇక, ఈ నిరసనకు తొలుత అనుమతి లేదని పేర్కొన్న ఢిల్లీ పోలీసులు.. చివరకు దిగివచ్చారు.
శనివారం ఉదయం అనుమతి ఇస్తున్నట్టు డిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆ వెంటనే సెంట్రల్ ఇండస్ట్రి యల్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దింపి వందలాది మందితో భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఉన్న దీప్కే శనివారం ఉదయం నేరుగా అమెరికా నుంచి ఢిల్లీ వచ్చి.. అటు నుంచే జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. చేతిలో అంబేడ్కర్ పుస్తకాన్ని పట్టుకుని ఆయన నిరసనలో పాల్గొ న్నారు.
ఎందుకీ ఉద్యమం?
ఇటీవల వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష పత్రం లీకైన విషయం తెలిసిందే. దీంతో 22 లక్షల మంది విద్యార్థులు నిరాసలో మునిగిపోయారు. ఈ లీకైన వ్యవహారానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. దీప్కే నేతృత్వంలోని సీజేపీ డిమాండ్ చేసింది. అయితే.. కేంద్రం దీనిపై పెదవి విప్పలేదు. అందుకే.. నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు.
హుటాహుటిన కేంద్రం..
సీజేపీ నిరసన ప్రారంభమైన గంట వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యాశాఖ ఉన్నతా ధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష జరిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సహా.. ఈ నెల 12న జరగనున్న పునః పరీక్షపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. కేంద్రం మాత్రం.. సీజేపీ నిరసనపై కాదని.. పరీక్ష విధివిధానాలపైనే ప్రధాని చర్చిస్తున్నారని చెప్పడం గమనార్హం. మొత్తంగా బొద్దింకలు అని ఎద్దేవా చేసిన సీజేపీ కదలితో కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం గమనార్హం.
This post was last modified on June 6, 2026 5:12 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…