Political News

మ‌మ‌త శ‌ప‌థం: అసెంబ్లీలో అడుగు పెట్ట‌ను.. !

ఇటీవ‌ల జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భ‌వానీ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ప‌రా జ‌యం పాలైన మాజీ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. తాను ఇప్ప‌ట్లో అసెంబ్లీలో అడుగు పెట్టేది లేద‌ని చెప్పారు. త‌న‌ను, త‌న పార్టీని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్ర‌మంగా ఓడించిన కేంద్రంపైనే త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని ఆమె చెప్పారు. అయితే.. అసెంబ్లీలోకి మాత్రం తాను వెళ్లేది లేద‌న్నారు.

ఈ క్ర‌మంలో ఆమె లోక్‌స‌భకు పోటీ చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌ట్లో లోక్‌స‌భ ఎన్నిక‌లు లేవు. అయిన‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన బ‌హ‌రాంపూర్ పార్ల‌మెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి యూస‌ఫ్ ప‌ఠాన్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే.. ఆయన‌తో రాజీనామా చేయించి.. ఆమె రంగంలోకి దిగుతార‌ని తెలుస్తోంది.

స్వాగ‌తించిన ప‌ఠాన్‌..

మ‌మ‌తా బెన‌ర్జీ త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తానంటే.. తాను సంతోషంగా రాజీనామాచేస్తాన‌ని ప‌ఠా న్ ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ప‌ఠాన్‌.. ప్ర‌ముఖ క్రికెట‌ర్‌. 2011లో ప్ర‌పంచ క‌ప్‌ను కొల్ల‌గొట్టిన బృందంలోనూ ఈయన ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌మ‌త ఆయ‌న‌ను పార్టీలోకి స్వాగ‌తించి 2024 ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి తానే బ‌రిలోకి దిగే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న ద‌రిమి లా.. ప‌ఠాన్ కూడా స్వాగ‌తించ‌డం గ‌మ‌నార్హం.

గెలుస్తారా?

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం సీఎం సువేందు అధికారి చేతిలో ప‌రాజ‌యం పాలైన మ‌మ‌త‌.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. బ‌హ‌రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ బ‌లంగా ఉంది. గ‌తంలో మాదిరిగా టీఎంసీ అభ్య‌ర్థులు లేరు. అయితే.. ప్ర‌స్తుత ఓట‌మి త‌ర్వాత‌.. త‌నకు సానుభూతి ప‌వ‌నాలు వ‌స్తున్నాయ‌ని మ‌మ‌త అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్ల‌మెంటుకు రెడీ అవుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 6, 2026 5:09 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

23 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago