Political News

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆస్తులు సంపాయించార‌ని. వ్యాపారాలు చేపట్టార‌న్న వాద‌న కూడా ఉంది. దీనిపై కేసులు న‌మోదు కావ‌డం.. ప్ర‌స్తుతం అవ‌న్నీ కోర్టుల విచార‌ణ ప‌రిధిలో ఉండడం తెలిసిందే. దాదాపు 10 సంవ‌త్స‌రాల‌కు పైగానే..జ‌గ‌న్ బెయిల్‌పై ఉన్నారు.

అయితే.. తాజాగా మ‌రో కేసు జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా వ‌స్తున్న సూచ‌న‌ల ప్ర‌కారం.. జ‌గ‌న్‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ అధికారులు.. విచారించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్‌కు నోటీసులు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న‌ను కేవ‌లం విచారిస్తారా? లేక‌.. అరెస్టు కూడా చేసే అవ‌కాశం ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో ఈ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది.

ఏం జ‌రిగింది?

ఏపీలో వైసీపీ హ‌యాంలో మ‌ద్యం అక్ర‌మాలు జ‌రిగాయ‌ని.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అత్యంత నాసిర‌క‌మైన మ‌ద్యాన్ని ఖ‌రీదుకు అమ్మి సోమ్ము చేసుకున్నారు. ప్రైవేటుగా చేయాల్సిన మ‌ద్యం వ్యాపారాన్ని ప్ర‌భుత్వమే చేసి.. త‌ద్వారా 3500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా అవినీతి పాల్ప‌డ్డారన్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ వ్య‌వ‌హారంపైనే కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించింది. ఇప్ప‌టికి 38 మందిని అరెస్టు చేసి.. విచారించారు. కొంద‌రు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

మ‌రి జ‌గ‌న్ పాత్ర ఏంటి?

ఈ మొత్తం అక్ర‌మాల్లో మ‌ద్యం విధానాన్ని మార్చ‌డం నుంచి త‌మ‌కు అనుకూలంగా ఉన్న కంపెనీల‌ను ఎంపిక చేసుకునే వ‌ర‌కు వైసీపీ అప్ప‌టి, ఇప్ప‌టి ఎంపీ మిథున్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారన్న వాద‌న ఉంది. అంతేకాదు.. ఇలా సంపాయించిన సొమ్ము.. చివ‌ర‌కు జ‌గ‌న్ ఖాతాల‌కే చేరింద‌న్న‌ది కీల‌క అంశం.

ఈ దిశ‌గానే అటు సిట్ అధికారులు.. ఇటు ఈడీ అధికారులు కూడా దృష్టి పెట్టారు. జ‌గ‌న్‌కు అంతిమ ల‌బ్ధి చేకూరింద‌ని వారు స‌మాచారం సేక‌రించారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను విచారించి.. అస‌లు విషయాన్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను అరెస్టు చేస్తారా? లేదా ? అనేది చూడాలి.

This post was last modified on June 5, 2026 2:50 pm

Share

Recent Posts

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

25 minutes ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

33 minutes ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

1 hour ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

2 hours ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

2 hours ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

4 hours ago