సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం అరుదే. నేచురల్ స్టార్ నాని ఒకప్పుడు చేసిన సినిమాలు వేరు కానీ.. ఇప్పుడు తన నుంచి వస్తున్న ది ప్యారడైజ్ పెద్ద సినిమా కిందే లెక్క. దీనికి పోటీగా ఏ సినిమా రిలీజ్ కాదనే అనుకున్నారంతా. ముందు వారం రావాల్సిన సినిమాలు కూడా తటపటాయిస్తుండడంతో బాక్సాఫీస్ దగ్గర నానికి ఖాళీగా గ్రౌండ్ వదిలేయబోతున్నట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా ది ప్యారడైజ్‌కు పోటీగా ఓ చిన్న సినిమా బరిలోకి దిగుతోంది. ఆ చిత్రమే.. అనుమాన పక్షి.
డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించిన ఈ చిత్రంలో రాగ్ మయూర్ అనే చిన్న నటుడు లీడ్ రోల్ చేశాడు. రాగ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఇదే. చాన్నాళ్లు మేకింగ్‌లోనే ఉండిపోయిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు విడుదలకు సిద్ధం చేశారు. ముందేమో సెప్టెంబరు 18నే రిలీజ్ అన్నారు. కానీ ఏమైందో ఏమో.. వాయిదా వేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ది ప్యారడైజ్ లాంటి క్రేజీ మూవీ రిలీజవుతున్న మరుసటి రోజే అనుమాన పక్షిని థియేటర్లలోకి దించుతున్నారు. మరి కంటెంట్ మీద నమ్మకమా.. లేక నాని సినిమా ఓవర్ ఫ్లోస్ ఉపయోగపడతాయనుకున్నారా… లేదంటే ప్యారడైజ్‌కు పోటీ అంటే మంచి పబ్లిసిటీ వస్తుందనుకున్నారా అన్నది తెలియదు కానీ అనుమాన పక్షి టీం బోల్డ్ స్టెప్పే తీసుకుంది.
సెప్టెంబరు 25కు రిలీజ్ డేట్ ఇస్తూ ది ప్యారడైజ్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ఒక కామెంట్ కూడా పాస్ చేసింది అనుమాన పక్షి టీం. బరిలో కాకి ఉందని పక్షి ఎగరడం ఆపదు అంటూ పోస్టర్ మీద వేశారు. ఈ కామెంట్‌ను నాని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. రేప్పొద్దున సినిమాలో కంటెంట్ తగ్గితే ఈ కామెంట్ బూమరాంగా కావచ్చు. ప్యారడైజ్ దెబ్బకు ఈ సినిమాకు కుదేలు కూడా కావచ్చు. మరి అనుమాన పక్షి నిజంగా ఈ డేట్‌కు కట్టుబడి నాని సినిమాతో పోటీపడుతుందేమో చూడాలి.
This post was last modified on September 16, 2026 9:36 pm
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…