అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.
తమిళనాడులో బీజేపీ బలోపేతం దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ఆ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ కోరినట్టుగానే తమిళనాట బీజేపీ బలోపేతానికి అన్నామలై తన శాయశక్తులా కృషి చేశారు. అయితే ఆ మధ్య ఏం జరిగిందో, ఏమో తెలియదు గానీ… అన్నామలై ఉన్నపళంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీని వీడే దిశగా ఆయన అడుగులు వేయగా… అధిష్ఠానం ఆయనను అనునయించే దిశగా సాగింది.
ఈ క్రమంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లిన అన్నామలై… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో పార్టీని వీడొద్దంటూ వారిద్దరూ అన్నామలైని కోరారు. చర్చల్లో పెద్దగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయని అన్నామలై… తమిళనాడు తిరిగి రాగానే… తాను ముందుగానే అనుకున్నట్లుగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానంతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ విభేదాల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
సమాజంలో మార్పును తీసుకువచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని… అందుకోసమే తాను బీజేపీలో చేరానని అన్నామలై అన్నారు. అయితే బీజేపీలో ఉంటూ తాను అనుకున్న పనిని చేయలేనని తెలిసిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తాను బీజేపీకి రాజీనామా చేశానన్న అన్నామలై.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు. మరి ఆ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
This post was last modified on June 5, 2026 2:46 pm
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…