Political News

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500
కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది.

ఈ క్రమంలోనే బొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈరోజు బ్రహ్మనాయుడును తమిళనాడులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయన ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.

This post was last modified on June 5, 2026 3:13 pm

Share

Recent Posts

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

37 minutes ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

1 hour ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

2 hours ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

2 hours ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

3 hours ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

3 hours ago