2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో పర్యాయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకోగా… ఏపీలో జనసేన, బీజేపీలతో జట్టు కట్టిన టీడీపీ తన వైరి వర్గం వైసీపీని చిత్తు చేసి మరీ అదికారం దక్కించుకుంది. ఈ ఫలితాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా… ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ నేతృత్వంలోని జనసేనది మాత్రం రికార్డు విక్టరీనేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాదించిన జనసేన… సెంట్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినట్టైంది.
సరే.. మరి ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని, ఈ దఫా జనసేన జట్టు కట్టిన కూటమిదే విజయమని అందరూ అంచనా వేసిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజున ఆ పార్టీ అధినేత ఎలా ఉంటారు? ఎలా ఉండటమేమిటి?… ఫుల్ ఎగ్జైటింగ్ మోడ్ లో ఉంటారు. ఒక్క చోట కాలు నిలపకుండా ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకుందామా? అన్నట్లుగా అత్యంత ఆసక్తితో ఫలితాల ట్రెండ్ ను గమనిస్తూ ఉంటారు. ఈ లెక్కన పవన్ కూడా హడావిడిలోనే ఉండి ఉంటారు కదా. అయితే నాడు తాను ఎలా ఉన్నారన్న విషయానికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఓ సరికొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తన ఇంటిలోనే ఉండిపోయిన పవన్ కల్యాణ్… అలా సోఫాలో అలా జారగిలబడి ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. లాల్చి, పంచెకట్టులో సాదాసీదాగా ఉన్న పవన్ లో నాడు ఎలాంటి ఆందోళన గానీ, ఎలాంటి ఆనందం గానీ, ఎలాంటి అత్యుత్సాహం గానీ, ఎలాంటి గాభరా గానీ కనిపించలేదు. మొత్తంగా చెప్పాలంటే… పవన్ నిశ్శబ్ధంగా కూర్చున్న పవన్ దేని గురించో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా కనిపించారు.
ఈ రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి కదా… అందరూ చెప్పినట్టు మనం గెలుస్తామా? లేదంటే ఆ జోస్యాలన్నీచతికిలబడి మనం ఓడిపోతామా? అన్న ఆందోళన నాడు పవన్ లో లేశమాత్రం కూడా కనిపించలేదనే చెప్పాలి. అయితే పవన్ అభిమానులు, జన సైనికులు మాత్రం… ఎలాగూ గెలుస్తున్నాం కదా… గెలిచాక ఏమేం పనులు చేయాలి? మనం ఎన్నికలప్పుడు ప్రజలకు ఏం హామీలిచ్చాం? వాటి అమలుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలి? అన్నఅంశాలపై పవన్ దీర్ఘాలోచనలో మునిగిపోయారంటూ చెప్పుకుంటున్నారు. మొత్తంగా రసవత్తరంగా సాగిన ఎన్నికల యుద్ధంలో ఫలితాలు విడుదలయ్యే సమయాన అలా ఎంతమాత్రం ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం అందరితో అయ్యే పని కాదని.. పవన్ లాంటి యోధులకు మాత్రమే సాధ్యమన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates