తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆమె వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. జగన్‌కు మద్దతుగా.. అదేసమయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా కవిత వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మావిగన్ రాజధాని కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోందన్నారు. అందుకే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అక్కడితో కూడా ఆగకుండా.. చుక్కనీరు పడితేనే ప్రస్తుత రాజధాని అమరావతి నిండామునుగుతోందన్నారు. ఆ నీళ్లు సెక్రటేరియెట్‌ను కూడా ముంచెత్తి.. సీఎం చంద్రబాబు సీటు కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అలా జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఏర్పాటు చేసిన ఏపీ వాళ్ల విగ్రహాలను తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చుట్టబెట్టి ఏపీకి పార్సిల్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్‌కు కవిత మద్దతు ఇస్తున్నారా? ఆయనకు అండగా ఉండాలని భావిస్తున్నారా? అని కొందరు వ్యాఖ్యానించారు.
అసలు చెల్లిపోయి.. కొసరు చెల్లి వచ్చింది.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్‌కు మద్దతిచ్చిన కేసీఆర్ బాట లోనే కవిత కూడా నడుస్తున్నారని.. కొత్తేమీ లేదని.. అందరూ ఆ తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై చర్చించకుండా.. ఏపీ రాజధాని గురించి ఎందుకని కవితపై మరికొందరు వ్యాఖ్యలు చేశారు.
కవితకు సబ్జెక్టు దొరకట్లేదా? అని ఒకరు వ్యాఖ్యానించారు. అమరావతి మునిగినా.. ఫర్వాలేదు.. చంద్రబాబు ఉన్నారు కాపాడుకునేందుకు.. కవిత మునగకుండా ఉండాలంటే.. కేంద్రమే దిక్కు అంటూ.. పరోక్షంగా లిక్కర్ కేసును ప్రస్తావించారు ఒకరిద్దరు. ఇలా.. సామాజిక మాధ్యమాల్లో కవిత చేసిన వ్యాఖ్యలపై సెటర్లు పడుతున్నాయి.
This post was last modified on June 1, 2026 10:45 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…