Movie News

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్ రూపంలో వచ్చేసింది. ఆడియో జ్యుక్ బాక్స్, భోపాల్ ఈవెంట్ లో రెహమాన్ అద్భుతంగా పాడి వినిపించినా విజువల్ చూడాలనే కోరిక ఫ్యాన్స్ లో బలంగా ఉంది. దాన్ని తీర్చే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో వదిలాడు దర్శకుడు బుచ్చిబాబు. ట్రైలర్ కట్ లో చూసిన ఎన్నో సీన్ల వెనుక ఎంత కష్టం ఉందో పరిచయం చేశాడు.

రామ్ చరణ్ చాలా ఇంటర్వ్యూలలో అన్నట్టు పెద్ది కోసం శారీరకంగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఈ మస్సా పాటలో చూడొచ్చు. ఒళ్ళంతా బురద పూసుకోవడం, మన్ను రాసుకోవడం, కేవలం పైల్వాన్ లంగోటాతో ఫైట్లు చేయడం వగైరాలన్నీ ఓ రేంజ్ లో పేలాయి. ముఖ్యంగా చివరి షాట్ లో అందరూ మూకుమ్మడిగా చరణ్ మీద పడితే వాళ్ళ మధ్యలో చేయి బయటికి చూపించి శివరాజ్ కుమార్ ని పిలవడం హైలైట్ అయ్యేలా ఉంది. అంత గొప్పగా కుదిరింది.

ఆ మధ్య మన శంకరవరప్రసాద్ గారుకి చివరి నిమిషంలో హుక్ స్టెప్ పాట ఎలా అయితే హెల్ప్ అయ్యిందో అచ్చం అదే తరహాలో పెద్దికి ఈ మస్సా మస్సా మైలేజ్ ఇవ్వడం ఖాయం. చరణ్, శివరాజ్ కుమార్ తప్ప ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. కేవలం సెట్స్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్ మాత్రమే కనిపించారు. ఏఆర్ రెహమాన్ స్కోర్ కి చరణ్ బాడీ బిల్డప్ కి బాగా మ్యాచ్ అయ్యాయి. బుచ్చిబాబు కష్టం కనిపించింది.

ఇక రోజుల నుంచి గంటల్లోకి కౌంట్ డౌన్ మారిపోయాక పెద్ది హైప్ క్రమంగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న టైంలో పెద్ది లాంటి స్టార్ హీరో సినిమా ఇప్పుడు అత్యవసరం. దానికి తగ్గట్టే మంచి అంచనాలు నెలకొనడంతో టాక్ బాగా వస్తే మాత్రం రికార్డులకు ఆకాశమే హద్దవుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ విలేజ్ డ్రామాలో దివ్యెందు శర్మ, జగపతిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

This post was last modified on June 2, 2026 9:28 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago