అక్క చెల్లెమ్మలకు.. 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగనన్న తోడు, భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి.. ఇన్ని ఇచ్చాం.. ఇవన్నీ ఎటు పోయాయో!. ఏం జరిగిందో! 2024 మేలో వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లు ఇవి. దీనికి కారణం.. ఆనాటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది.
మేం ఓడిపోలేదు. ఇది ఎన్నికల సంఘంతో జరిగిన పోరు. నేను నా పదవికి రాజీనామా కూడా చేయను. ఇక్కడ జరిగింది బీజేపీతో యుద్ధం కాదు. ఎన్నికల సంఘంతో యుద్ధం. మా ఓట్లు తొలగించి.. మాపైనే ఎన్నికల సంఘం దబాయించింది. – ఇది.. ఈ నెల మొదట్లో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన నాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. మొత్తంగా తమ ఓటమిని అంగీకరించలేదు.
అయితే.. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఎవరిని ఎందుకు ఓడించారన్న దానికి స్పష్టమైన రుజువులు కనిపిస్తాయి. ప్రజల చిత్తంలో అనేక రీజన్లు కూడా ఉంటాయి. తాజాగా.. అదే మమతా బెనర్జీ మేనల్లుడు.. ఎంపీ అభిషేక్ బచ్చన్‌ను ప్రజలు పరుగులు పెట్టించి మరీ కొట్టారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు, ఇలా.. చేతికి ఏది అందితే దాంతో కొట్టారు. పోనీ.. ఇదేమన్నా బీజేపీ ఇలాకానా? దాడి చేసిన వారు బీజేపీ మనుషులా? అంటే సమాధానం కాదనే వినిపిస్తుంది.
తృణమూల్ కాంగ్రెస్‌కు ముఖ్యంగా మమతకు గట్టి పట్టున్న నియోజకవర్గం సోనాపూర్‌లోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపించింది. అంతేకాడు.. దొంగ-దొంగ.. అంటూ మహిళలే అభిషేక్‌ను వెంబడించారు. అసలు ఏం జరిగిందటే.. ఇటీవల ఎన్నికల అనంతరం.. రాష్ట్రంలో బీజేపీకి-తృణమూల్ వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోనాపూర్‌లో దెబ్బలు తగిలి.. ఆసుపత్రి పాలైన కేడర్‌ను పరామర్శించేందుకు అభిషేక్ వెళ్లారు.
కానీ, ప్రజలే స్వచ్ఛంంగా బయటకు వచ్చి అభిషేక్‌పై విమర్శల వర్షం కురిపించారు. చెప్పులు, రాళ్లు విసిరారు. ఇంకా కసి తీరని ప్రజలు.. బూతుల వర్షం కురిపించారు. దొంగ వచ్చాడు.. అంటూ మహిళలు తగులుకున్నారు. సో.. ఇదీ.. మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయారో చెప్పడానికి నిదర్శనం. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుఅంచనా వేసి ఉంటే.. వ్యవస్థలను.. తన వారినీ సరిదిద్దుకునే వారు. తద్వారా.. మరోసారి అధికారం చేపట్టేవారు. కానీ.. అంతా బాగుందని జగన్ మాదిరిగా అనుకున్న నేపథ్యమే ప్రజలకు దూరం చేసింది.
This post was last modified on May 31, 2026 11:44 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…